Wednesday, February 18, 2026
Homeక్రీడలుఈ రోజైనా అభిషేక్ శర్మ ఫామ్ లోకి వచ్చేనా..?

ఈ రోజైనా అభిషేక్ శర్మ ఫామ్ లోకి వచ్చేనా..?

క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:- T20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ మరియు నెదర్లాండ్స్ జట్ల మధ్య ఈరోజు 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టి20 వరల్డ్ కప్ లో భారత్ ఇవాళ తన చివరి లీగ్ మ్యాచ్ పసికూనా నెదర్లాండ్స్ జట్టు తోనే ఆడనుంది. మొన్నటి వరకు సూపర్ ఫాం కనబరిచిన అభిషేక్ శర్మ గత రెండు మూడు మ్యాచ్ల నుంచి సరైన అవకాశం లేక అలాగే ఫామ్ లేక పోవడం అనేది ఫ్యాన్స్ కు సైతం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే సూపర్ హిట్ కు ముందుగానే ప్లేయర్లు ప్రాక్టీస్కు ఈ మ్యాచ్ చాలా మంచి అవకాశం అనే చెప్పవచ్చు. భారత క్రికెట్ అభిమానులందరూ కూడా ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

అతను ఫామ్ లోకి రావాలి అని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అభిషేక్ శర్మ గత రెండు మ్యాచ్లలో డక్ ఔట్ అవడం ఫాన్స్ ను పూర్తిగా నిరాశకు గురి చేసింది. ఇక మిడిల్ ఆర్డర్లో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ తన ఆటలో ఇంకాస్త దూకుడు పెంచాల్సి ఉంది అని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఈ టి20 వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గాలి అంటే కచ్చితంగా భారత జట్టులో టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ పై ఆధారపడి ఉంటుంది అని… కాబట్టి వీరు మరింత అద్భుతంగా ఆడే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రస్తుతం టీం ఇండియా జట్టులోని బౌల్లెర్స్ అందరూ బాగానే రాణిస్తున్న బ్యాట్స్ మెన్స్ పై ఎక్కడో ఒకచోట దిగులు కనిపిస్తుంది. ఈరోజు నెదర్లాండ్స్ పై ప్రాక్టీస్ మ్యాచ్ అనుకొని ప్రస్తుతం ఫామ్ లో లేని వారందరూ కూడా తిరిగి ఈ మ్యాచ్ ద్వారా పుంజుకోవాలి అని అంటున్నారు. ఏ మ్యాచ్ ను కూడా ఈజీగా తీసుకోవద్దు అని ఫ్యాన్స్ సైతం టీమ్ ఇండియా జట్టుకు సూచిస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments