
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- నాకు అన్యాయం జరిగిన పర్వాలేదు కానీ నా మునుగోడు ప్రజలకు అన్యాయం జరగొద్దు అని ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు మండలంలోని ఏలగలగూడెం గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణమునకు భూమి ఇచ్చిన దంపతులను సన్మానించారు. గ్రామ సమస్యలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ నెల్లికంటీ సత్యం మాట్లాడుతూ అనాడు సరియైన నిధులు లేక రోడ్ల సమస్యలు ఉండడం జరిగిందని, రోడ్ల సమస్యతో అనేక ఇబ్బందులు పడడం జరిగింది. రోడ్డు వేస్తేనే అభివృద్ధి అనేది అవుతుంది అన్నారు. నిత్యం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషి చేయడం అభినందనీయం అన్నారు. ఎమ్మెల్యేతో కలిసి ప్రయాణం చేస్తామన్నారు.
Read also : రొమాంటిక్ రోల్ చేయడం అస్సలు నచ్చలేదు : అనుపమ
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… ఈ గ్రామానికి ఎమ్మెల్సీ రావడం గొప్ప విషయం అన్నారు. కలిసిమెలిసి పనిచేసీ అభివృద్ధి చేయాలని ముందుకు సాగుతున్నామన్నారు. పార్టీలు వేరైనా ఎక్కడ న్యాయం ఉంటే అక్కడే ఉంటానన్నారు. సత్యం గారు నేను కోట్లాడుతా ఎర్ర సైన్యం కూడా నా వెంటా రావాలి. నిజాయితీగా కష్టపడి పని చేసే వాళ్ళమ్మటి ఉండాలి. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినపుడు మా ఇద్దరి అన్నదముల్లకు మంత్రి పదవి ఇస్తే తప్పా అన్నారు. ఆ భగవంతుడు ఏ పదవి ఇచ్చిన మునుగోడు ప్రజల కోసమే కానీ నా కోసం కాదన్నారు.కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడికి అండగా ఉంటామనీ హామీ ఇచ్చారు. నాకు పదవి ముఖ్యం కాదు నా ప్రజలు ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,మేకల ప్రమోద్ రెడ్డి, ఏఈ సతీష్ రెడ్డి,మాజీ సర్పంచ్ సురిగి చలపతి, ఉపసర్పంచ్ మేకల శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచులు మిరియాల వెంకటేశ్వర్లు,జక్కలి శ్రీను,సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను,గురిజ రామచంద్రం,అనంత లింగస్వామి గౌడ్, బీమనపల్లి సైదులు,పాల్వాయి చెన్నారెడ్డి,వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, తీర్పాటి వెంకటేశ్వర్లు ఈదులకంటి కైలాస్, ఎండి అన్వర్,గోసుకొండ మల్లేష్,అద్దంకి వెంకటయ్య,అనంత సాయి గౌడ్ ,విద్యుత్ శాఖ అధికారులు,కార్యదర్శి,గ్రామస్థులు పాల్గొన్నారు.
Read also : అమెరికా మద్దతు ఇచ్చినప్పుడల్లా రెచ్చిపోవడం పాక్ ఆర్మీ చీఫ్ కు అలవాటే : భారత్