
న్యూ ఢిల్లీ బ్యూరో,క్రైమ్ మిర్రర్:-  మానవత్వం ముక్కలైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో చోటుచేసుకుంది. డబ్బు కోసం కన్నతల్లి సంతానాన్ని అమ్మేసిన షాకింగ్ ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం… తన తల్లి, ఇద్దరు అక్కలు కలిసి రూ.10 లక్షలకు అమ్మేశారని, బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టారని తెలిపింది. తాను ప్రతిఘటించడంతో కుటుంబసభ్యులే కొట్టి గాయపరిచారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు తల్లితో పాటు ఇద్దరు అక్కలను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను మహిళా శెల్టర్‌హోమ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక దర్యాప్తులో, నిందితులు డబ్బు కోసం మైనర్ బాలికను వ్యభిచార గ్యాంగ్‌కు అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మానవ అక్రమ రవాణా, మైనర్ అమ్మకం, దాడి, వేధింపు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికులు ఆగ్రహంతో… తల్లి అనే పవిత్ర బంధం ఇలా అవమానానికి గురవ్వడం మనసును కలిచేస్తోంది. డబ్బు కోసం మానవత్వం అమ్ముకునే స్థాయికి దిగజారడం దుర్మార్గం
అని వ్యాఖ్యానించారు. ఈ ఘటన మానవ విలువలు, మహిళా భద్రతపై మళ్లీ పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా వైరల్  అవుతుంది. 
Read also : తెలంగాణ మంత్రిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
Read also : సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు.. శ్వేతా సింగ్ సంచలన ఆరోపణలు?
 
				 
					
 
						 
						




