
చండూరు, క్రైమ్ మిర్రర్:- చండూరు పట్టణంలోని ప్రధాన రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే చౌరస్తాలో ఒక లైను దాదాపుగా పూర్తి కావచ్చింది. మరో లైను దాదాపుగా దుకాణదారులు తమ కట్టడాలని కూల్చివేసుకొని అందరు కూడా సెట్ బ్యాక్ అయ్యారు. కానీ చౌరస్తాలో కొందరు, మునుగోడు బైపాస్ కి ఆపోజిట్ లో మరికొందరు తమ కట్టడాలను కూల్చివేసుకోకుండా చోద్యం చూస్తున్నారు. దీంతో రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం అవుతున్నాయి. మామూలుగా రోడ్ల పైన ఉండే డబ్బా కొట్టు దారులను లేదా మధ్య తరగతి వారి కుటుంబాలకు చెందిన కట్టడాలను తొలగించగలుగుతున్న అధికారులు వీరి తెరువు పోవడం లేదని ఆరోపణలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు ఈ దుకాణదారుల వెనుక కాపు కాస్తుంది ఎవరు అనేది స్థానికంగా సర్వాత్ర చర్చ నడుస్తుంది.
ఇప్పటికే రోడ్డు విస్తరణకు సంబంధించి వసూళ్ల పర్వం జరిగిందనే పలు రూమర్లున్నాయి. కొన్ని కట్టడాలకు అయితే ఓ వర్గం నాయకులు మూకుమ్మడిగా వెళ్లి గట్టిగా కట్టడాలు తొలగించే వరకు పనిచేశారు. కానీ ఈ రెండు చోట్ల మాత్రం ఎవరు నోరు మెదపడం లేదని దీని వెనక ఏ కథ నడుస్తుంది అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ మల్లేశాన్ని వివరణ కోరగా. ఈ రెండు చోట్ల ఉన్న కట్టడాలను క్లియర్ చేయడం విషయమై ఇప్పటి వరకు పబ్లిక్ హెల్త్ వారు గానీ సదరు గుత్తేదారుడు గాని నాకు సమాచారం ఇవ్వలేదని. ఈరోజే సమాచారం వచ్చిందని చౌరస్తాలోని కట్టడాలకు సంబంధించిన యజమానులకు ఇప్పటికే సమాచారం పంపామని ఒక రోజులో కూల గొట్టుకోకపోతే తామే కూల గొట్టుతామని తెలిపామన్నారు. ఇక మునుగోడు బైపాస్ కు ఎదురుగా ఉన్న దుకాణాల విషయం కూడా వెంటనే పరిశీలిస్తామన్నారు.
మరిన్ని వార్తలను చదవండి …