
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా టికెట్ రేట్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రోజుల్లో సినిమా టికెట్ రేట్లు భారీగా పెరిగిపోయాయి అని.. అలా అయితే కుటుంబాలతో కలిసి సినిమాలు చూడాలంటే ఎలా కుదురుతుంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్మాతలపై మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో కలిసి సినిమాలు చూడాలి అంటే కచ్చితంగా టికెట్ ధరలు తక్కువ ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఇకపై దయచేసి ఎవరూ కూడా సినిమాల విషయంపై మా దగ్గరకు రావద్దు అని స్పష్టం చేశారు. మరి ముఖ్యంగా మూవీ టికెట్ ధరలు పెంచమని నిర్మాతలు అలాగే దర్శకులు మా దగ్గరికి రాకండి అని అన్నారు. ఇక ఈ సినిమా టికెట్ ధరలు పెంచకూడదని గతంలోనే ఒక నిర్ణయం తీసుకున్నాము అని కానీ ఈసారి పొరపాటు జరిగింది అని వివరించారు. అసలు ఈ హీరోలకు వందల కోట్ల రూపాయలను ఎవరు రెమ్యూనరేషన్ గా ఇవ్వమన్నారు?.. వాళ్లకి అన్ని కోట్లు ఇస్తున్నామని మా దగ్గరకు వచ్చి టికెట్ రేట్లు పెంచమంటే ఎలా కుదురుతుంది అని ప్రశ్నించారు. కాబట్టి ఇకనుండి ఈ టికెట్ ధరల విషయంపై మా దగ్గరకు ఎవరూ కూడా రావొద్దు అని విజ్ఞప్తి చేశారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో అఖండ 2 ప్రీమియర్స్ రేట్లు పెంపు జీవోను హైకోర్టు రద్దు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మంత్రి కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది.
Read also : వచ్చే మూడేళ్లు అధికారంలో ఉన్న పైసా అభివృద్ధి జరగదు : కేటీఆర్
Read also : తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ వైరల్?





