అంతర్జాతీయం

పుతిన్‌ తో భేటీకి జెలెన్‌ స్కీ.. ట్రంప్ ప్రయత్నం!

Putin-Trump-Zelensky Meet: రష్యా, ఉక్రెయిన్‌ శాంతి చర్చల్లో భాగంగా ఈ నెల 15న అమెరికాలోని అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు.  ఈ భేటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీని ఆహ్వానించాలని   ట్రంప్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  శాంతి చర్చల్లో ఉక్రెయిన్‌ను భాగం చేయాలని బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోలండ్, ఫిన్లాండ్‌ వంటి ఐరోపా దేశాలు అగ్ర రాజ్యానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లో తమ భూభాగం వదులుకోమన్న జెలెన్‌ స్కీ

నిజానికి తొలుత ఈ భేటీకి జెలన్ స్కీని ఆహ్వానించాలని అమెరికా భావించలేదు. అంతేకాదు, శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకోవాల్సి రావచ్చని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై  జెలెన్‌ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌కు భాగస్వామ్యం లేకుండా ట్రంప్‌, పుతిన్‌ల మధ్య జరిగే చర్చలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. వారు ఏదైనా డీల్‌ కుదుర్చుకుంటే అది విఫల పరిష్కారమే అవుతుందన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూభాగాన్ని వదులుకునే ప్రసక్తే లేదని జెలెన్‌ స్కీ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే పుతిన్ తో జరిగే సమావేశానికి జెలన్ స్కీని ఆహ్వానించాలని ట్రంప్ భావిస్తున్నారు.

ఈ నెల 15న అలస్కాలో శాంతి సమావేశం

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధానికి తెర దించే ప్రయత్నంలో భాగంగాఈ నెల 15న కీలక సమావేశం జరగబోతోంది. అలస్కాలో ఈ సమావేశం జరగబోతుందన్నారు ట్రంప్. రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులు పుతిన్‌, జెలెన్‌స్కీ ఇద్దరూ శాంతిని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ ఒప్పందంలో ఇరు దేశాల మధ్య భూభాగాల మార్పిడి ఉంటుందన్నారు. ఇరు దేశాలకూ ప్రయోజనం కలిగించేలా.. కొన్ని ప్రాంతాలను తీసుకోవడం,  మరికొన్నింటిని వదులుకోవడం జరగవచ్చన్నారు.

Read Also: మేం మునిగితే.. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం: పాక్‌ ఆర్మీ చీఫ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button