
వైఎస్ జగన్ ఎక్కడున్నారు..? ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తారు..? జనవరి నుంచే జిల్లాల పర్యటన అన్నారు… ఇప్పుడు ఏప్రిల్ కూడా వచ్చేసింది. ఇప్పటి వరకు జిల్లాల పర్యటన ఊసే లేదు. అడపా దడపా అమరావతికి వచ్చి.. మళ్లీ బెంగళూరు వెళ్లిపోతున్నారు జగన్. దీంతో జిల్లాల పర్యటన సంగతేంటని కేడర్ ప్రశ్నిస్తోంది…? సారెక్కడ… అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు పార్టీ శ్రేణులు. అసలు… జగన్ జిల్లాల పర్యటన ఎందుకు వాయిదా పడుతోంది…?
2024 ఎన్నికల్లో ఘోర ఓటమి వైఎస్ జగన్‌కు పెద్ద దెబ్బ. ఈ ఓటమితో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం, నిస్తేజం వచ్చేశాయి. పార్టీలోని నిస్తేజాన్ని పోగొట్టి… కార్యకర్తలలో జోష్ తెప్పించే బాధ్యత పార్టీ అధినేతపై ఉంటుంది. కానీ.. జగన్ ఆ దిశగా ప్రయత్నాలు చేయడంలేదు. ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ఇంతవరకు మొదలుపెట్టనే లేదు. దీంతో… పార్టీ కేడర్‌లో నిస్తేజం మరింత పెరిగిపోతుంది. దీంతో… పార్టీ నేతలు, జిల్లాల ఇన్‌ఛార్జ్‌లు జగన్ జిల్లాల పర్యటన కోసం ఎదురుచూస్తున్నారు. ఆ కార్యక్రమంతో అయినా… జగన్ ప్రజల్లోకి వస్తే… కార్యకర్తల్లో జోష్ పెరుగుతుంది… వారిలో ధైర్యం వస్తుందని.. భావిస్తున్నారు.
జనవరిలోనే జిల్లాల పర్యటన ప్రారంభించాలని వైఎస్ జగన్ భావించారు. సంక్రాంతి అయిపోయిన తర్వాత… ప్రతి జిల్లాకు వెళ్తానని స్వయంగా జగనే ప్రకటించారు. కానీ… ఆ తర్వాత ఏమైందో ఏమో… జిల్లాల పర్యటన వాయిదా పడింది. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ఉమ్మడి జిల్లాల వారీగా.. అప్పుడప్పుడు కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు జగన్. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని… రాబోయేది జగన్ టూ పాయింట్ వో అని కార్యకర్తల సమావేశాల్లో చెప్పారు కూడా. అంతేకాదు… జిల్లాల పర్యటన చేపడతానని.. వారానికి రెండు రోజులు జిల్లాల్లోనే ఉంటానని చెప్పారు. జగన్ జనంలో వస్తే… ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని.. కార్యకర్తల్లో ధైర్యం పెరిగి… ఉత్సాహంగా పనిచేస్తారని పార్టీ నేతలంతా ఆశించారు. కానీ…. జగన్ జిల్లాల పర్యటనపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు..? ఎప్పుడు పర్యటిస్తారో తేదీ ఖరారు కాలేదు…? జగన్ పర్యటన కోసం జిల్లాల్లో వైసీపీ నేతలు వెయిట్ చేస్తున్నారు.
వైఎస్ జగన్.. జనంలోకి వెళ్లిన ప్రతిసారీ అనూహ్య స్పందన వస్తోంది. జైల్లో ఉన్న నేతలను కలిసేందుకు వెళ్లినా… గుంటూరు మిర్చి యార్డ్‌లో రైతులను పరామర్శించేందుకు వెళ్లినా… జనం తండోప తండాలుగా తరలివచ్చారు. దీంతో.. వైసీపీలో కొంత జోష్ వచ్చింది. జగన్ జిల్లాల పర్యటన చేస్తే… ఆ జోష్ పీక్స్ వెళ్తుంది. అయితే…. జగన్ చేపట్టిన జిల్లాల వారీ సమీక్షలు ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. అవన్నీ పూర్తయిన తర్వాత.. జిల్లాల పర్యటనకు వెళ్లాలని యోచిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు… కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా పూర్తికాలేదు. కనుక… ఇంకొంత సమయం ఇచ్చి.. జిల్లాల పర్యటన చేస్తే బాగుంటుందనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే… జగన్ జిల్లాల పర్యటన ఆలస్యమవుతోందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.
ఇవి కూడా చదవండి ..
-
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎంఐఎందేనా..? – పోటీకి ముందుకు రాని ప్రధాన పార్టీలు
-
16 రోజులు జైల్లో నరకం చూశా- సీఎం రేవంత్‌రెడ్డి భావోద్వేగం
-
వైఎస్ షర్మిలపై పెరుగుతున్న వ్యతిరేకత- కాంగ్రెస్‌ను వీడుతున్న కడప నేతలు
-
కాశీనాయన క్షేత్రం కాంట్రవర్సీ – పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన జగన్
-
టీడీపీకి కనిపించని శత్రువు పవనే..! – ఈ సత్యం చంద్రబాబు గ్రహించేదెప్పుడో..?