
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో మొంథా తుఫాన్ ప్రభావంగా ఇప్పటికే చాలా జిల్లాలలో వాగులు మరియు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షాల దాటికి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా చాలా నగరాలు అయితే నీట మునగాయి. దీని ద్వారా ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ అధికారులు ఈ మొంథా తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై దాదాపుగా తగ్గినట్లేనని చెప్పినా కూడా.. నేడు మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
 నేడు వర్షాలు కురిసే జిల్లాలు
1. ఆదిలాబాద్
2. ఆసిఫాబాద్
3. మంచిర్యాల
4. నిర్మల్
5. నిజామాబాద్
6. జగిత్యాల
7. రాజన్న సిరిసిల్ల
8. కరీంనగర్
9. పెద్దపల్లి
10. భూపాలపల్లి
11. ములుగు
పైన పేర్కొన్న ఈ 11 జిల్లాలలో నేడు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కాబట్టి ఈ 11 జిల్లాల ప్రజలు ఈరోజు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కొన్ని నగరాలు జలమయం కాగా.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్త చర్యలను తీసుకుంటుంది. కాబట్టి ఈరోజు కూడా ఏవైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు. తుఫాన్ ప్రభావం తగ్గినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. నవంబర్ మొదటివారంలోగా వర్షాలు తగ్గుముఖం పడతాయని.. అప్పటి వరకు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని.. దూరపు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరారు.
Read also : నేడు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజ్ కు రెండో ప్రమాద హెచ్చరిక!
Read also : ఫర్టిలైజర్ షాప్ లో అర్ధరాత్రి దొంగతనం
 
				 
					
 
						 
						




