క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష వైసిపి పార్టీపై కీలక ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డు విషయంలో వైసీపీ పార్టీ తప్పు చేసింది అని స్పష్టం చేశారు. కొన్ని కోట్ల మంది హిందువులు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్లి ఎంతో ఇష్టంగా, భక్తితో ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాంటి ప్రసాదంలో కల్తీ జరిగితే ఆ దేవుడు ఉపేక్షించరు అని తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో 2032 దేవాలయాల పై దాడులు చేశారు అని… ఆ పరిస్థితులలో వైసీపీ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంది అని ప్రశ్నించారు. వైసీపీ పార్టీ హయాంలో తిరుమల పైనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా హిందూ మతంపై దాడులు చేశారు అని అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఎవరైనా సరే దేవాలయాల జోలికి వస్తే ఉపేక్షించే పరిస్థితి లేదు అని వైసీపీ నాయకులకు హెచ్చరికలు చేశారు. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే ఈ జన్మలోనే వారికి తప్పకుండా శిక్ష పడుతుంది అని సీఎం హెచ్చరించారు. ఇక ఈ తిరుమల క్షేత్రంపై వైసీపీ పార్టీ ఇప్పటినుంచే కాదు అని జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాటి కాలం నుంచే కుట్రలు జరుగుతున్నాయి అని ఆరోపించారు. ఇకనుంచైనా మీ ప్రవర్తన మార్చుకోవాలి అని వైసిపి పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో నేడు దంచికొట్టనున్న వర్షాలు
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు : కేటీఆర్

