తెలంగాణ

అవినీతి విషయంలో… పురుషులే కాదు?.. మహిళలు కూడా తగ్గేదేలే?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి సంబంధించి ప్రతిరోజు కూడా చాలానే వార్తలు వస్తున్నాయి. నిత్యం సోషల్ మీడియా లేదా ఏ పేపర్ చూసినా కూడా అవినీతి లేని న్యూస్ అయితే మాత్రం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కూడా… అది ప్రభుత్వ కార్యాలయమైన లేదా ప్రైవేట్ కార్యాలయమైన ఈ మధ్య చాలానే అవినీతి జరుగుతుంది. ఎక్కడికెళ్ళినా కూడా లంచం లేనిదే చాలామంది అధికారులు కూడా పనిచేయట్లేదు. అయితే అవినీతి విషయంలో పురుషులు మాత్రమే కాదు మేం కూడా తగ్గేదే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు చాలామంది మహిళా అధికారులు. పురుషులకంటే మేమేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఏసీబీ దాడుల్లో ఈ ఏడా ఇప్పటివరకు ఏకంగా 18 మంది మహిళ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డారు. దీంతో ఏసీబీ అధికారులు కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎక్కడ కెళ్ళినా కూడా మహిళలు లంచం తీసుకుండగా దొరికిపోతున్నారని… ఇదే బుద్ధి రా నాయన అంటూ ఏసీబీ అధికారులే నిద్రపోతున్నారు.

అవినీతి విషయంలో చాలామంది ఏసీబీకి చిక్కిపోయారు. చిన్న వారి నుండి… పెద్ద పెద్ద వారు కూడా ఈ ఏసీబీ దాడుల్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అలా కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంతమంది మహిళలు ఉండడం చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇంతకుముందు ఎక్కువగా లంచాలు అనే మాట వస్తే ఎక్కువగా పురుషులే కనపడతారు. కానీ ఈమధ్య పురుషులకు మేం కూడా ఏమాత్రం తగ్గమని లంచం తీసుకోవడంలో మహిళలు ఎక్కువైపోయారు. వేల రూపాయల నుంచి లక్షల్లో లంచాలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ సంవత్సరంలో ఇప్పటివరకు వందమంది పురుషులకు పైగా ఆఫీసర్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇలాగే మిమ్మల్ని కూడా ఎవరైనా లంచం అడిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 నెంబర్ కి లేదా (9440446106), లేదా ACB వెబ్సైట్లో సంప్రదించవచ్చు అని అధికారులు వెల్లడించారు.

దోశ తింటుండగా గొంతులో ఇరుక్కుని రెండేళ్ల బాలుడు మృతి!

ఉగ్రరూపం దాల్చిన పాకాల బీచ్.. జర జాగ్రత్త!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button