
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో దసరా స్పెషల్ బస్సుల్లో టికెట్ రేట్లు పెంచడంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. పండుగలు వస్తే చాలు.. పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సుల్లో విపరీతంగా ధరలు పెంచేస్తున్నారు. ప్రశాంతంగా ప్రజలు ప్రయాణం చేయనివ్వకుండా ముక్కు పిండి అధిక చార్జీలు వసూలు చేయడం చాలా దారుణం.. చాలా దుర్మార్గం.. అని హరీష్ రావు తెలంగాణ ఆర్టీసీ పై ఫైర్ అయ్యారు. దసరా సెలవుల్లోనే అదనపు సర్వీసుల పేరిట ఏకంగా 50 శాతం అదనంగా కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు దసరా, బతుకమ్మ పండుగలా సంతోషం లేకుండా చేయడమేనా ఈ కాంగ్రెస్ ప్రజాపాలన?… ఇదే నా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి?.. అని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Read also : ఏపీలో దసరా సెలవులు పొడిగించాలని డిమాండ్?
కాగా దసరా పండుగను పురస్కరించుకొని.. స్పెషల్ బస్సులలో సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. దీని ద్వారా టికెట్ ధరలు 50% పెరిగే అవకాశం ఉంది. ఈనెల 20వ తేదీ, 27-30, అక్టోబర్ 1, 5,6 తేదీల్లో నడిచే స్పెషల్ బస్సులపై ఈ సవరణ చార్జీలు అమలులో ఉంటాయని పేర్కొంది. రెగ్యులర్ గా నడిచే సర్వీసుల బస్సుల చార్జీలలో ఎలాంటి మార్పు ఉండదని ఈ సంస్థ తెలిపింది. అయితే అప్పట్లో 2003 వ సంవత్సరంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 16 ప్రకారం స్పెషల్ బస్సులకు ఛార్జీలు సవరిస్తున్నట్లు ఆర్టిసి గతంలో చాలాసార్లు వివరణ అనేది ఇచ్చింది. దీని ద్వారానే స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు 50% పెంచుతున్నట్లుగా తెలంగాణ ఆర్టీసీ ప్రకటించడం జరిగింది. ఈ స్పెషల్ బస్సుల చార్జీలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు నేడు తీవ్రంగా మండిపడ్డారు.
Read also : పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన డిఐజి ఎల్ ఎస్ చౌహన్!