తెలంగాణ

తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం.. రేపు రాత్రి ఉచిత రవాణా సదుపాయం

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.  న్యూఇయర్‌ సందర్భంగా డిసెంబర్ 31, మంగళవారం రాత్రి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో.. ఉచిత రవాణా సదుపాయం అందిస్తామని వెల్లడించింది. ఇందుకోసం 500 కార్లు, 250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని..   తెలంగాణ ఫోర్‌ వీలర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ప్రజలంతా ఈ సర్వీసు వినియోగించుకోవాలని.. మద్యం తాగి వాహనాలు డ్రైవ్ చేసి.. ప్రమాదాలకు కారకులు, బాధితులు అవ్వొద్దని.. తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కోరింది. గత 8 సంవత్సరాలుగా ఈ సర్వీసు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వీసు కోసం కాల్ చేయాల్సిందిగా వారు 9177624678 నంబర్‌ను అందుబాటులో ఉంచారు. తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ (TGFWDA), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) #HumAapkeSaathHai క్యాంపెయిన్‌తో ఈ సర్వీసు అందిస్తున్నట్లు తెలిపాయి.

ఇవి కూడా చదవండి : 

  1. మద్యం ప్రియులకు పండగే.. పండగ… వైన్స్‌ షాపులు, బార్‌ల సమయ వేళలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
  2. శుభవార్త అందించిన టీటీడీ బోర్డు.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతి
  3. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. ఎమ్మెల్సీ కవిత
  4. రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్!… ఇంటర్నేషనల్ రికార్డ్?
  5. ఇదేం ఫీల్డింగ్ రా బాబు!… బాక్సింగ్ డే టెస్టులో ఆసక్తికర సన్నివేశం?

Back to top button