వాట్సాప్ కు పి యం కిసాన్ ఏపీకే పేరిట వచ్చిన లింకును ఓపెన్ చేసిన రైతులు బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బులు మాయమయ్యాయి. దీంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. వారి వివరాల ప్రకారం… పథకానికి సంబంధించిన డబ్బులు జమ వివరాలు తెలుసుకోవాలంటే ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేయాలని రావడంతో కోనారంపేట కు చెందిన ఇద్దరు మంగళ్ పెళ్లికి చెందిన ఒక రైతు వాట్సాప్ కు లింక్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే ముగ్గురి ఖాతాల్లో నుంచి రూ. 32 వేలు, రూ. 57 వేలు, రూ. 70 వేల చొప్పున కట్ అయ్యాయి. దీంతో బాధితులు సంబంధిత బ్యాంకుకు వెళ్లి విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపారు.
వారు పరిశీలించి ఖాతాలో నుంచి డబ్బులు బదిలీ అయ్యాయి అన్నారు. ట్రాన్స్ఫర్ అయిన ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు అప్పటికే డబ్బులు తీసుకున్నారని తామేమి చేయలేమని పేర్కొన్నారు. పేరిట వాట్సాప్ కు వస్తున్న యాప్ ను ఓపెన్ చేయవద్దని సూచించారు.