
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఐపీఎల్ రిటర్న్షన్ గడువు నేటితో ముగియనున్న సందర్భంగా ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లను త్వర త్వరగా ట్రేడ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా జట్లకు సంబంధించి ఈ కీలక ప్లేయర్ల మార్పులు జరిగాయి. లక్నో సూపర్ జేయింట్స్ జట్టుకు ఇప్పటికే మహమ్మద్ షమీ మరియు సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ వెళ్లారు. మరోవైపు ముంబై ఇండియన్స్ కు షార్దుల్ ఠాకూర్, షెఫర్డ్ మరియు మయాంక్ మార్కండే వచ్చారు. ఇక ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడిన నితీష్ రానా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి చేరిపోయారు. జడేజా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు, సంజు సాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి చేరిపోయారు. చెన్నై జట్టు నుంచి కాన్వే, పంజాబ్ కింగ్స్ జట్టు మాక్సివల్ ను వదిలేశారు. ఇక ఈసారి ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 16వ తారీఖున అబుదాబిలో జరగనున్నట్లు ESPN వెల్లడించింది. ఈసారి అన్ని జట్లు పెద్ద మొత్తంలో ప్లేయర్లను వదులుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మినీ వేలం ఈసారి ఆసక్తికరంగా మారనుంది. ఈరోజు సాయంత్రానికల్లా పూర్తిగా ప్లేయర్ల రిటెన్షన్ జాబితాను ఆయా జట్లు విడుదల చేయనున్నాయి.
Read also : Emotional post: తండ్రి కృష్ణను గుర్తుచేసుకుని మహేశ్ బాబు భావోద్వేగం
Read also : Tiger Attack: అడవిలో కారు ఆపి రీల్స్ చేస్తుంటే పెద్దపులి దాడి





