
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై హోం మంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. నేడు ఒంగోలు పర్యటనకు వచ్చిన మంత్రి అనిత ఆ కార్యక్రమాన్ని పూర్తిచేసుకుని తిరిగి ఒంగోలు నుండి బయలుదేరుతుండగా మీడియా వేదికగా కొన్ని కీలక విషయాలను చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ చిన్నపిల్లాడిలా పట్టు పట్టడం ఏంటని హోం మంత్రి అనిత ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా అనేది ముఖ్యమంత్రి , లేకపోతే స్పీకర్ ఇలాంటివారు ఇచ్చేది కాదు. ప్రతిపక్ష హోదా కేవలం ప్రజలు ఇవ్వాలి.. అంతేకానీ చిన్నపిల్లడిలా జగన్ మారం చేయడం ప్రతి ఒక్కరిని నవ్వులు పూయిస్తుందని.. ఇది తగదు అని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడడం ఒక నాయకుడి లక్షణం… అలాంటిది అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళ మెత్తే అవకాశాన్ని జగన్ పూర్తిగా చేజార్చుకోవడం తనకే నష్టం కలిగిస్తుందని మంత్రి అనిత జగన్ కు సూచనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా అసెంబ్లీకి రావాలి… ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి అంతేకానీ ఎక్కడో ఉండి రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టడం కాదని మంత్రి అనిత స్పష్టం చేశారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి రావడం ఇష్టం లేకపోతే.. ప్రజలు గెలిపించినటువంటి మిగతా ఆ, 10 మంది ఎమ్మెల్యేలు నైనా అసెంబ్లీకి పంపాలని అన్నారు. ప్రజలు వైసీపీ పార్టీపై, జగన్ పాలన పై ఎంత విసుకు చెందితే ఇలా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేస్తారో అర్థమైంది కదా అని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ వేదికగా ప్రజల సమస్యలపై గళం విప్పితేనే.. ఏ నాయకుడి బలం ఏంటో తెలుస్తుంది. అంతేకానీ ఎక్కడో ఉండి ప్రజల సమస్యల పై పోరాటం చేస్తానంటే అది తనకి తనకే సిగ్గుచేటు అని మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also : బ్రేకింగ్ న్యూస్… లైంగికంగా వేధించాడంటూ కేఏ పాల్ పై యువత ఫిర్యాదు!
Read also : పత్తి పనికి వెళ్తున్న బాలిక… లోకేష్ చేసిన పనికి ప్రశంసలు!