
క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:-“బలగం” సినిమాతో డైరెక్టర్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో వేణు పేరు మారుమ్రోగిపోయింది. ఈ సినిమా ద్వారా వేణు ఒక డైరెక్టర్ గా గుర్తింపు కూడా పొందారు. బలగం అనే సినిమా చాలా చిన్న బడ్జెట్, చిన్న చిన్న ఆర్టిస్టులతో చేసిన సినిమా. కానీ దాని ప్రభావం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువయ్యింది. అయితే బలగం అనే మూవీ తర్వాత డైరెక్టర్ గా వేణు తన తర్వాత ప్రాజెక్టు ఎల్లమ్మ అని కన్ఫామ్ చేశారు. ఈ సినిమాలో హీరోగా నితిన్ పేరు వినిపించింది. ఈ విషయం అప్పట్లో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నిర్మాత దిల్ రాజ్ కూడా ఎల్లమ్మ సినిమాలో నితిన్ నటిస్తున్నారు అని కొన్ని సందర్భాల్లో చెప్పారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి నితిన్ తప్పుకుంటున్నట్లుగా సమాచారం అందింది. మరోవైపు ఈ ఎల్లమ్మ కథను హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు వినిపించగా అతను ఓకే చేసినట్లుగా సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నితిన్ ఫాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. సరైన హిట్ లేక హీరో నితిన్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. నితిన్ తాజాగా నటించినటువంటి చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచాయి. ఒకప్పుడు రాజమౌళి తో “సై” సినిమా తీసిన నితిన్ ఆ తరువాత అతనికి చాలానే ఛాన్సులు వచ్చాయి. కానీ కొన్ని నెలల నుంచి నితిన్ కు అసలు హిట్ సినిమా పడలేదు. దీంతో ఎల్లమ్మ ద్వారానైనా తిరిగి కం బ్యాక్ ఇస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ అనూహ్యంగా ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించట్లేదని సమాచారం రావడంతో ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా నితిన్ ఫాన్స్ అయితే తీవ్ర నిరాశలో ఉన్నారు.
Read also : నిర్మాణం జరుగుతున్న ఇంట్లో వందల ఓట్లు.. జూబ్లీహిల్స్ కలకలం
Read also : అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మాల్ మార్కెట్..!