
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ప్రస్తుత కాలంలో నిరుపేద కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ స్కూల్స్ నడుస్తున్నాయి అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ స్కూల్ అంటేనే పిల్లలతో పాటుగా వారి తల్లిదండ్రులు కూడా భయపడిపోతున్నారు. బాగా డబ్బున్న వారు ప్రైవేట్ స్కూల్స్లో ఎంత డబ్బును ధారపోసైనా తమ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. కానీ నిరుపేద కుటుంబాలు ప్రైవేట్ స్కూల్లో చేర్చాలంటే ఫీజులు చూసి భయపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ స్కూల్లో చేర్చితే విద్యార్థి భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆందోళన. ఇలా మధ్యతరగతి కుటుంబాలు ఎంతోమంది పిల్లలను చదివించుకోవాలి అని అనుకున్న కూడా చదివించుకోలేకపోతున్నారు. అయితే తాజాగా 2024 – 25 విద్యా సంవత్సరంలో మన భారతదేశవ్యాప్తంగా దాదాపు 7993 ప్రభుత్వ స్కూల్లో జీరో అడ్మిషన్లు నమోదు అయినట్లుగా కేంద్ర ప్రభుత్వం సంచలన విషయాన్ని వెల్లడించింది.
Read also : తుఫాన్ ఎఫెక్ట్ AP కే కాదు… తెలంగాణకు కూడా?
ఒక విద్యార్థి కూడా చేరని స్కూల్స్ లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో దాదాపు 3812 ప్రభుత్వ స్కూల్లలో ఒక విద్యార్థి కూడా లేడు. తెలంగాణ విషయానికి వస్తే దాదాపు 2245 ప్రభుత్వ స్కూళ్లలో ఒక విద్యార్థి కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఆయా ప్రాంతాలలో ఒక విద్యార్థి లేకపోయినా పశ్చిమబెంగాల్ లో ఏకంగా 17965 మంది టీచర్లు ఉన్నారట. అదే మన తెలంగాణలో అయితే దాదాపు 1016 మంది టీచర్లు ఉన్నారు అని స్పష్టం చేశారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు… ఈ మధ్యతరగతి కుటుంబాలు కూడా ప్రభుత్వ స్కూళ్లను నమ్మలేకపోతున్నా సందర్భాలు చూస్తున్నాం. తమ పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చేర్పిస్తే ఎక్కడ విద్య తక్కువ అందుతుందో అని.. ఎక్కడ జలసాలకు అలవాటు పడతారు అని అప్పుడు వరకు సంపాదించిన డబ్బును మొత్తం పిల్లల చదువులకే అయిపోగొట్టేస్తున్నారు. ఇప్పటి నుంచైనా రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం వచ్చేలా చేయాలని మరి కొంత మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు.
Read also : తుఫానుకు అంతా సిద్ధం… నేటి నుంచే అతి భారీ వర్షాలు!





