
పిట్లం,క్రైమ్ మిర్రర్:- మంగళవారం రాత్రి నుండి భారీగా కురుస్తున్న కుండపోత వర్షానికి.. మంజీరా నదిపై ఉన్న సింగూరు,నల్లవాగు,కాకివాగు,కళ్యాణి ప్రాజెక్ట్,సింగీతం రిజర్వాయర్,పోచారం ప్రాజెక్ట్, పైనుండి ఎక్కువగా వరదనీరు రావడంతో దీనికి తోడు ప్రధానమైన నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుండి 16 వరద గేట్ల ద్వారా 1,50,000 పైచిలుకు వరద నీటిని మంజీరా నదిలోకి వదులుతుండడంతో పరివాహక ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయం గుప్పిట్లో ఉన్నారు. అయితే గత ముడు సంవత్సరాల క్రితం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామానికి హైలెవల్ వంతెన నిర్మించారు. అందుకు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఆ హైలెవల్ వంతెన పైనుండి మంజీరా ప్రవహిస్తుంటే భయంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి వరద గత 40 సంవత్సరాలుగా ఎన్నడూ చూడలేదు అని గ్రామస్తులు తెలిపారు.వర్షాకాలం పూర్తి అయ్యేవరకు ఇంకా ఎం జరుగుతదో అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.గంగమ్మ తల్లి శాంతించు అంటూ మహిళలు,గ్రామ ప్రజలు దేవుణ్ణి వేడుకుంటున్నారు.
Read also : గట్టుపల్లి వీరహనుమాన్ ఆలయంలో మట్టి విగ్రహాల పంపిణీ
Read also : ఖైరతాబాద్ గణేషుడి సన్నిధిలో మహిళ ప్రసవం