Homeతెలంగాణఎస్ ఎస్ ఆర్ హైస్కూల్ లో సైన్స్ దినోత్సవం

ఎస్ ఎస్ ఆర్ హైస్కూల్ లో సైన్స్ దినోత్సవం

మునుగోడు,క్రైమ్ మిర్రర్:- మునుగోడు మండల కేంద్రంలోని ఎస్ ఎస్ ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సైన్స్ ఫెయిర్ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఎనిమిదవ తరగతి విద్యార్థులు గుండెకు సంబంధించిన భాగాలు గీసి అది పనిచేసే విధానాన్ని అద్భుతంగా వివరించారు. 9వ తరగతి విద్యార్థులు వర్షపు నీటిని ఉపయోగించి ఎటువంటి ఖర్చు మరియు కల్పితం లేని విద్యుత్ తయారుచేసి వివరించారు. ఏడవ తరగతి విద్యార్థులు జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్రమాన్ని అద్భుతంగా వివరించారు. ఆరవ తరగతి విద్యార్థులు సూర్యకిరణాల నుండి కాంతిని సేకరించి విద్యుత్ తయారు చేసే విధానాన్ని చక్కగా వివరించారు. పదవ తరగతి విద్యార్థులు కన్ను మరియు అది పనిచేయు విధానాన్ని వివరించారు. ఐదు,నాలుగు తరగతి విద్యార్థులు వారి స్థాయికి మించి ఆలోచించి వివిధ రకాల పరికరాలను తయారు చేసి అద్భుతంగా వివరించారు. విద్యార్థులు తమ నైపుణ్యానికి స్థాయికి మించి ప్రతిభ కనబరిచారని, విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయులు కోటేశ్వర్, జంగిలి నరసింహ ,నరసింహ, విద్యాసాగర్, వెంకటేశ్వర్లు ,మనోహర్, అశోక్ మరియు పాఠశాల స్టాప్ పాల్గొన్నారు.

అప్పారెడ్డిపల్లి కొత్త చెరువుపై కబ్జా దందా.. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల గర్జన!

Mutton Curry: మటన్ కర్రీని ఇలా వండి తింటే.. ముక్కతో పాటు చేతి వేళ్లను కూడా వదలరు..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు