
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:- తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యే పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సుప్రీం కోర్టు మూడు నెలలు టైమ్ ఇచ్చి.. నిర్ణయాన్ని స్పీకర్‌కు వదిలేసింది…? మరి స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది..? ఎమ్మెల్యేలపై అనర్హత వేటా…? లేక… వ్యూహాత్మక నిర్ణయమా..? వాట్ నెక్ట్స్.
Read also : మంత్రి పదవి కోసం కలలు కంటున్న రాజు గారు – కల తీరేనా..? చెదిరేనా..?
రాజకీయాల్లో ఫిరాయింపులు సర్వ సాధారణమే. అధికారంలో ఉన్న పార్టీలోకి పక్క పార్టీ నేతలు జంప్ అవుతూ ఉంటారు. ఇప్పుడే కాదు… గతంలో ఇలాంటి గోపీలు కోకొల్లలు. అలా.. పార్టీలోకి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతుంటారు. అయితే… రాజ్యాంగపరంగా అది తప్పు. ఒక పార్టీ బీఫామ్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు.. మరో పార్టీలోకి జంప్ అయితే… పదవికి రాజీనామా చేసి వెళ్లాలి. కానీ… ఎంత మంది అలా చేస్తున్నారు..? అన్నదే ప్రశ్న. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు… తలసాని శ్రీనివాసయాదవ్ లాంటి వారు కూడా పార్టీ మారారు. పదవికి రాజీనామా చేయకుండా… మరో పార్టీలో కొనసాగారు. అయితే… అప్పుడు ఎవరూ కోర్టుకు వెళ్లలేదు. కానీ.. ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీం కోర్టు తలుపు తట్టింది. దీంతో.. సమస్య జఠిలమైంది.
Read also : పులివెందులలో పోటాపోటీ – వైసీపీ పట్టు నిలిచేనా…? టీడీపీ పంతం నెగ్గేనా..?
2023 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పవర్‌లోకి వచ్చింది. బీఆర్‌ఎస్ ఓడిపోయింది. ఆ తర్వాత.. బీఆర్‌ఎస్ బీఫామ్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, ప్రకాశ్‌గౌడ్.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. 10 మంది ఎమ్మెల్యే పార్టీ వీడటంతో… బీఆర్‌ఎస్ ఈ అంశంపై గట్టిగా పట్టుబట్టింది. అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. కాలం గడిచిందే గానీ… చర్యలు తీసుకోలేదు. దీంతో న్యాయపోరాటం మొదలుపెట్టింది. సుప్రీం కోర్టు తలుపుతట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు.. 10మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. అంటే… ఇప్పుడు బాల్ స్పీకర్ కోర్టులో ఉంది. మరి స్పీకర్ నిర్ణయం ఏంటి…? సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటారా..? తీసుకుంటే… ఆ నిర్ణయం ఎలా ఉండబోతోంది..? ఎమ్మెల్యేల అనర్హత వేటు వేస్తారా..? అన్న అంశాలపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
Read also : గుండాల మండలంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్
సుప్రీం కోర్టు తీర్పును గౌరవించాలి… 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు… ఆ 10 స్థానాల్లో ఉపఎన్నికలు ఖాయమని.. పార్టీ కేడర్ సిద్ధంగా ఉండాలని కూడా సంకేతాలు పంపుతోంది గులాబీ పార్టీ. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది…? ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే.. బైఎలక్షన్ తప్పదు. 10 స్థానాలకు ఉపఎన్నికలు అంటే… మామూలు విషయం కాదు. ఇంచుమించు అసెంబ్లీ ఎన్నికలే. ఆ 10 స్థానాల్లో కొన్ని ఓడిపోయినా.. కాంగ్రెస్‌కు దెబ్బే. కనుక… అనర్హత వేటు వేయరనేది విశ్లేషకుల మాట. మరి ఏం చేస్తారు..? ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో న్యాయ సలహా తీసుకుంటున్నట్టు సమాచారం. మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పీకర్‌ను సూచించిందే గానీ.. ఆదేశించలేదని న్యాయనిపుణులు చెప్తున్నారు. రాజ్యంగం ప్రకారం.. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో స్పీకర్‌కే అధికారం ఉంటుంది. కనుక.. స్పీకర్ నిర్ణయమే ఫైనల్. ఈ క్రమంలో… స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారని చర్చ జోరుగా జరుగుతోంది.