
క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం :- విశాఖలో జరగబోతున్న జనసేన సమావేశాలు ఆసక్తి రేపుతుతన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ పైనే ఉంది. పార్టీ విస్తృతస్థాయి సమావేశాలకు విశాఖనే ఎందుకు ఎంచుకున్నారు. స్టీల్‌ప్లాంట్‌పై ఆయన స్టాండ్ చెప్పబోతున్నారా..? లేదా… ఇప్పుడు కూడా వైసీపీపైనే నెపం నెట్టి తప్పించుకుంటారా..? పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏపీ రాజకీయాల్లో జనసేన మీటింగ్‌పై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది.
Read also : టీబీజేపీ ఎంపీల విజయంపై వివాదం – ఓట్లు చోరీ చేశారంటున్న కాంగ్రెస్..!
విశాఖ స్టీల్‌ప్లాంట్ సమస్య రగులుతూనే ఉంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ కార్మికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇటీవల జీవీఎంసీ (GVMC) కౌన్సిల్ సమావేశం కూడా రసాభాసగా జరిగింది. వైసీపీ, కమ్యూనిస్ట్ పార్టీల ఆందోళనతో… స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ ఏకగీవ్ర తీర్మానం చేసింది జీవీఎంసీ. ఇప్పుడు… విశాఖలోనే జనసేన పార్టీ సమావేశాలు జరగబోతున్నాయి. పిఠాపురంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ సభ తర్వాత… ఆ స్థాయిలో విశాఖలో సభ పెట్టబోతోంది జనసేన. ఈనెల 30న పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఈ సమావేశాల్లో స్టీల్‌ప్లాంట్ ప్రస్తావన వస్తుందా…? ఈ అంశంలో తన స్టాండ్ ఏంటో పవన్ కళ్యాణ్ చెప్తారా…? లేదా వైసీపీనే దోషిని చేసి.. నాలుగు విమర్శలు చేసి వెళ్లిపోతారా…? పవన్ ప్రకటించే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది..
Read also : భారీ వర్షాలకు కోతకు గురైన నేషనల్ హైవే?
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవటీకరణ కానివ్వమని గతంలో చాలాసార్లు చెప్పారు పవన్ కళ్యాణ్. స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం 11వేల కోట్లు మంజూరు చేసినప్పుడు కూడా… అది తమ చిత్తశుద్ధి అని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే స్టాండ్‌పై ఉన్నారా..? స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. 32 ప్రైవేట్ విభాగాలను ప్రైవేట్‌పరం చేస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు స్టీల్‌ప్లాంట్‌లో రోజురోజుకూ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దీంతో.. మళ్లీ ప్రైవేటీకరణ తప్పదన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో.. కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఈ సమయంలో డిప్యూటీ సీఎం హోదాలో విశాఖ వస్తున్న పవన్ కళ్యాణ్.. వారికి ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు విశాఖలో జనసేన విస్తృతస్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 28న జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరగనుంది. 29న పార్లమెంట్ నియోజకవర్గాలపై చర్చ ఉంటుంది. 30న జనసేన మహాసభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు.
Read also : బోర్ కొడితేనే.. రిటైర్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మొహమ్మద్ షమీ?