
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- భూమ్మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక పని చేసుకుని వీకెండ్ వస్తే కాస్త ఉపశమనం పొందుతాడు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతున్న వేలా అలాగే వీకెండ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీకెండ్ టూర్ల ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు పనిలో పనిగా వర్షాలు పడడం వల్ల అలాగే రెండు మూడు రోజులపాటు వీకెండ్ సెలవులు వస్తుండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టూర్ వేద్దామని ఆలోచిస్తున్నారు. అయితే మీరు వీకెండ్ టూర్ వెళ్దామని అనుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదుకు దగ్గరలోనే చాలానే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వర్షాకాలంలో జలపాతాలు అనేవి పాల నురగలా ప్రవహిస్తూ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా అలాగే ఆనందింప చేస్తాయి. అయితే మన హైదరాబాదుకు దగ్గరలో ఎంత దూరంలో ఏ ఏ జలపాతాలు ఉన్నాయనేది చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ల లో ఏ జలపాతాలు ఉన్నాయో తెలుసుకుందాం.
వాటర్ ఫాల్స్ కిలోమీటర్లలో…
1. కుంటాల జలపాతం- హైదరాబాద్ నుంచి 270 కిలోమీటర్లు
2. బొగత జలపాతం – హైదరాబాదు నుంచి 280 కిలోమీటర్లు
3. మల్లెల తీర్థం – హైదరాబాదు నుంచి 190 కిలోమీటర్లు
4. ఒంటిమామిడి లొద్ది జలపాతం – హైదరాబాద్ నుంచి 356 కిలోమీటర్లు
5. ఎత్తిపోతల జలపాతం – హైదరాబాద్ నుంచి 180 కిలోమీటర్లు.
6. తలకోన వాటర్ ఫాల్స్ – హైదరాబాదు నుంచి 570 కిలోమీటర్లు.
ఈ ఆరు జలపాతాలు కూడా చూడడానికి చాలా బాగుంటాయి. కాబట్టి ఎవరైనా ఉద్యోగులు లేదా టూర్లు ప్లాన్ చేసేవారు కచ్చితంగా ఈ వర్షాకాలంలో ఈ జలపాతాలకు వెళ్లడం వల్ల చాలా బాగా చిల్ అవ్వచ్చు. కాబట్టి వీకెండ్ టూర్ ప్లాన్ చేసుకునేవారు ఈ జలపాతాలకు వెళ్లడం మంచిగా సంతృప్తి ఇస్తుంది.