
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి వాతావరణం మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 23, 24 మరియు 25వ తేదీలలో కొన్ని జిల్లాలలో వర్షాలు దంచుకొడతాయి అని ప్రకటించింది. ఇవాళ మరియు రేపు వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయని… రాబోయే మరో రెండు మూడు రోజులు పాటు కొన్నిచోట్ల సాధారణం కంటే రెండు లేదా మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది. మరోవైపు వాతావరణ ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం కొన్ని జిల్లాలలో అయితే 15 డిగ్రీల సెంటిగ్రేట్ కన్నా తక్కువగా నమోదు అవుతున్నాయి. ఇవాళ అదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల మరియు సంగారెడ్డి వంటి జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవనున్నాయి . బయలుదేరుకున్న జిల్లాలలో 11-14°C ఉష్ణోగ్రతలు.. మిగతా అన్ని జిల్లాలలో 15°C నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Read also : Viral video: రైలులో మ్యాగీ చేసిన మహిళ.. ఇదోరకం పిచ్చి అని నెటిజన్ల కామెంట్స్
Read also : దేవుళ్ళు అంటే చులకనా.. రాజమౌళిని జైల్లో వేయాలి : ఎమ్మెల్యే రాజాసింగ్





