Tuesday, February 24, 2026
Homeతెలంగాణతెలంగాణలో భారీ వర్షాలు.. ఇవాళ ఏ జిల్లాల్లో కురుస్తాయంటే?

తెలంగాణలో భారీ వర్షాలు.. ఇవాళ ఏ జిల్లాల్లో కురుస్తాయంటే?

Telangana Weather Alert: తెలంగాణలో వరుసగా మూడు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ తెలంగాణతో పోల్చితే ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. నైరుతి రుతుపవనాలకు తోడు, చత్తీస్ గఢ్ మీదుగా బలమైన సుడిగుండం ఏర్పడ్డంతో విస్తారంగా వానలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తారు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇవాళ వర్షాలు కురిసే జిల్లాలు ఇవే!

ఇవాళ తెలంగాణ అంతటా వాతావరణం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చత్తీస్‌ గఢ్ మీదుగా ఏర్పడిన బలమైన సుడిగుండం ఇవాళ సాయంత్రం లోగా రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపారు. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వానలు పడతాయని తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.  అటు అరేబియా సముద్రంలో బలమైన గాలులు వీస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం తెలంగాణ మీద కూడా ఉంటుందన్నారు.

సోమవారం వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందంటే?

రుతు పవనాలు బలపడటంతో సోమవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ కేంద్రం అధికారులు. ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, జయశంకర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయన్నారు. నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు బయటకు రాకూడదన్నారు.

Read Also: శ్రీశైలానికి పోటెత్తిన వరద, సాగర్ లోకి ఇన్ ఫ్లో ఎంతంటే?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments