
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన గురించి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చర్చించుకుంటున్నారు. తాజాగా ఎర్రకోట వద్ద జరిగినటువంటి బాంబు పేలుడు ఘటనపై బీజేపీ పార్టీ స్పందించింది. ఎర్రకోట లక్ష్యంగా దాడులకు పాల్పడడంని ఖండించింది. మన దేశ గుండెపై దాడి చేయడం ఒక కుట్రలో భాగమని పేర్కొంది. ఇలాంటి కుట్రకు పాల్పడిన వారందరూ కూడా ఊపిరి పీల్చుకునే లోపే కచ్చితంగా మట్టుపెట్టడం జరుగుతుంది అని బీజేపీ పార్టీ వెల్లడించింది. ఫరీదాబాద్ ధ్వంసం యాదృచ్ఛికం అసలు కానే కాదు… ఇది మన దేశ త్రివర్ణ పతాకం పైనే జరిగిన దాడిగా పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ఇలాంటి దాడులను ఉపేక్షించేదే లేదు అని తెలిపింది. కాగా నిన్న జరిగినటువంటి బాంబు పేలుడు ఘటనలో దాదాపు 13 మందికి పైగా మృతి చెందారు. ఇంకా ఎంతోమంది ఈ ఘటనలో గాయాలు పాలయి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తే లేదు అని బీజేపీ పార్టీ స్పష్టం చేసింది. ఎర్రకోట కుట్ర కేవలం రాయి, ఉక్కు పై దాడి కాదు. ఇది భారతదేశ ఆత్మపై దాడి అని తెలిపింది. ఇప్పటికే ఈ ఘటనలో మృతి చెందిన వారికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read also : హైదరాబాదులో పెద్ద ఎత్తున సామూహిక విష్ప్రయోగానికి ప్రణాళిక..!
Read also : నా భూమి నాకు ఇప్పించండి సారు..!





