అంతర్జాతీయం

త్వరలోనే దేశమంతటా మావోయిజం, నక్సలిజం లేకుండా చేస్తాం : ప్రధాని మోదీ

క్రైమ్ మిర్రర్,అంతర్జాతీయ న్యూస్:-
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మావోయిజం మరియు నక్సలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారతదేశమంతటా కూడా ఇలాంటివి లేకుండా చేసే బాధ్యత నాది అని సంచలన ప్రకటన చేసారు. తాజాగా బీహార్ లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ … కొన్ని విషయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. RJD లాంటి పార్టీలు అధికారంలో ఉంటే శాంతి భద్రతలు ఎలా ఉంటాయని బీహార్ లో జరిగినటువంటి ఎన్నికల ర్యాలీలో భాగంగా ప్రతిపక్ష పార్టీని తీవ్రంగా విమర్శించారు. RJD పాలనలోనే ఈ రాష్ట్రం సర్వనాశనమైందని ఆరోపించారు. ఈ పార్టీ పాలనలోనే దోపిడీలు, కిడ్నాప్ లు, హత్యలు సర్వసాధారణమైపోయాయని వ్యాఖ్యానించారు. మావోయిజం, నక్సలిజం కారణంగా ఎంతో మంది మహిళలు, యువత అలాగే దళితులు తీవ్రంగా నష్టపోయారని… ఈ మధ్యకాలంలో వీరు ఇంకా హద్దులు మీరుతున్నారని చెప్పుకొచ్చారు. 2014లో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చినప్పటి నుంచి బీహార్ లో వీటిని ఒక్కొక్కటిగా అణిచివేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో దేశం మొత్తం మీదట ఈ పేర్లు వినపడకుండా చేస్తాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also : మునుగోడులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Read also : మనలాగే పాకిస్తాన్ కు గట్టి షాక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. ఏంటంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button