
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొన్ని ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు తెలిపాయి. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే వచ్చే నెల 3వ తేదీ నుంచి కాలేజీల బంద్ చేపడుతామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు నేడు పేర్కొన్నాయి. తాజాగా బకాయిలు చెల్లించాలి అంటూ ప్రభుత్వ సలహాదారుడైనటువంటి కేశవరావుకు వినతి పత్రం కూడా అందజేశారు. ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ఇచ్చిన ప్రకారం 900 కోట్లను నవంబర్ 1వ తేదీ లోపు రిలీజ్ చేయాలని డిమాండ్ కోరారు. ఈలోపు బకాయిలు చెల్లించ లేదంటే కచ్చితంగా బందుకు సంబంధించి ఈనెల 22వ తేదీన ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా ఈ మధ్యనే బీసీ బంద్ జరగగా త్వరలోనే మళ్లీ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు బంద్ నిర్వహిస్తుండడంతో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరికి అర్థం కావడం లేదు. పనులు కావడం లేదు కానీ బంద్ లు అయితే నిర్వహిస్తున్నారు అంటూ మరి కొంతమంది నెటిజనులు ఫైర్ అవుతున్నారు. మరి ప్రైవేట్ యాజమాన్యాలు హెచ్చరించిన ప్రకారం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
Read also : బ్రేకింగ్ న్యూస్.. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందిన టిడిపి నేత
Read also : ఏపీ అంబాసిడర్ల లా పని చేయాలి.. సిడ్నీలో లోకేష్ స్పీచ్ వైరల్ !