
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- మన భారతదేశంలో ఎంతో మంది రైతులు వ్యవసాయం చేస్తున్న కూడా మూడు పూటల తినడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో రంగాలు ఉన్నా కూడా అన్ని రంగాలను పోషించేది మాత్రం వ్యవసాయ రంగమే. అలాంటి వ్యవసాయం చేసే రైతన్నల కష్టం వృధా కాలేదు. ఎందుకంటే తాజాగా మన భారత దేశంలో పండించి అమెరికాకు దిగుమతి చేస్తున్నటువంటి బియ్యం పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ విధించనున్నట్లుగా సంకేతాలు పంపించడంతో కొన్ని కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఒకప్పుడు మన భారతదేశం అమెరికా గోధుమలపై ఆధారపడింది. కానీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతి దారుగా ఉంటూ అదే అమెరికాకు మనం సరఫరా చేస్తూ అభివృద్ధి చెందుతున్నాం.
Read also : మైదానంలోనే కాదు.. ర్యాంకింగ్స్ లోనూ ఆదరగొట్టేసారు?
ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన ఇండియా నుంచి వచ్చే బియ్యం పై టారిఫ్స్ విధిస్తామని అనగానే గతంలోని చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి. 1960ల నాటి సంవత్సరకాలంలో గ్రీన్ రివల్యూషన్ తో ఆహార లోపం నుంచి ఆహార భద్రత దిశగా భారతదేశం ప్రయాణించింది. నేడు అమెరికా రైస్ దిగుమతుల్లో నాలుగో వంతు మన భారతదేశం నుంచి అందుతున్నాయి అంటే మన భారత దేశంలో వ్యవసాయం ఎంతలా వేగంగా అభివృద్ధి చెందుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మన భారత రైతన్నల సత్తా అంటూ అమెరికా పై సెటైర్లు వేస్తున్నారు. కానీ మన భారతదేశంలో మాత్రం రైతన్నల పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించట్లేదు. వీటిపై ప్రశ్నించలేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ విషయాన్ని గ్రహించి వ్యవసాయ రైతన్నలకు అండగా నిలబడాలని కోరుతున్నారు.
Read also : నిజాయితీగా పని చేస్తా పేద ప్రజలకు అండగా ఉంటా.. ఆశీర్వదించండి : స్వతంత్ర సర్పంచి అభ్యర్థి





