ఇప్పటి వరకు గెలిపించాం.. ఇక గెలిచి చూపిస్తాం

గండిపేట్,క్రైమ్ మిర్రర్:- సామాజిక చైతన్యంతోనే రానున్న గ్రేటర్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లు మైలార్ దేవ్ పల్లి డివిజన్ పద్మశాలి జేఏసీ ప్రతినిధుల బృంధం వెల్లడించింది. మెజారిటీ ఓటర్లుగా విజయాలు అందిస్తున్న తమకు రెండు దశాబ్దాల పూర్వం కోల్పోయిన ప్రజా ప్రాతినిధ్యం తిరిగి ఏ నాయకుడు కల్పింకపోవడంలో వారి రాజకీయ నైజంలోని అంతర్యంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. ఆదివారం ఉమ్మడి మైలార్ దేవ్ పల్లి డివిజన్ పద్మశాలీల రాజకీయ చైతన్య ముఖాముఖి సమావేశం లక్ష్మిగూడ, వాంబే కాలనీ , ఆర్జీకే ప్రాంతాల పద్మశాలిలు శ్రీ దుర్గా మాత ఆలయ సమీపంలో నిర్వహించారు. కొత్త డివిజన్ లుగా ఏర్పాటు కానున్న కాటేదాన్, మైలార్ దేవ్ పల్లి వార్డుల నుంచి కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేయడానికి తాము సిద్దమని వారు వెల్లడించారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కార్పొరేటర్ గా పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న ఆయా పార్టీల్లోని పద్మశాలి నాయకులను పిలిచి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ పద్మశాలీలకు టికెట్ ఇచ్చినా గెలిపించుకు తీరుతామని స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆయా పార్టీలకు తగిన విధంగా ఓటర్లుగా బుద్ది చెప్పడానికి పద్మశాలిలు ప్రత్యేక కార్యాచరణతో పోరాటానికి సిద్దమని తెలిపారు. ఈ సమావేశంలో పద్మశాలీ జేఏసీ బృంధం నాయకులు మునగపాటి వెంకటేశ్వర్లు , సంకూరి జయప్రకాష్, మసున వెంకటేష్, ఏర్వ సత్యనారాయణ, కాశీగారి యాదగిరి, పులిజాల వివేకానంద, కొంపల్లి జగదీశ్, ఉస్కెమూరి విజయ్ కుమార్, పెగుడ కిరణ్ కుమార్, బొల్ల వెంకటేష్, శిరందాసు నరేందర్, కోట శ్యామ్ కుమార్, గంజి లాలీశ్వర్, మునగపాటి విష్ణు, దొంతరాజు, కొంపల్లి జగదీష్ తోపాటు ఆ ప్రాంత పద్మశాలి సంఘం ప్రతినిధులు సిరిసాల నారాయణ, బిర్రు రాధా కృష్ణ, గుజ్జరి గోవర్ధన్, గంజి రాజు, ఉస్కెమూరి చంద్రశేఖర్, సంకూరి శ్రీకాంత్, కోట పవన్ కుమార్, బాస కృష్ణ, కూరపాటి సతీష్, కూరపాటి బాలస్వామి, గాడేపల్లి లక్ష్మణ్, ఎలిగేటి సత్యనారాయణ, దొంత ఉప్పలయ్య, సిద్రాల రాజు, కోట రవి, బాస దామోదర్ మ్యాకం ఈశ్వర్, యంజాల శేఖర్, సామల యాదయ్య, పెంట సత్యనారాయణ, వేముల రాజయ్య, గుర్రం ఆంజనేయులు, కొండ పరమేశ్వర్, పసునూరి విష్ణు, ఎల్లా చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button