అంతర్జాతీయం

యుద్ధంలో మనదే పై చేయి.. అయినా కూడా ఎందుకు విరమించారు?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పోటాపోటీగా యుద్ధం జరుగుతున్న సందర్భంలో అనూహ్యంగా యుద్ధ విరమణ చేశారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఆగిపోయింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పులు విరమణకు ఒప్పుకోవడంపై చాలామంది నుంచి వ్యతిరేకత నెలకొంది. యుద్ధంలో భారత్ గెలవడం 100% గ్యారెంటీ అయినా కూడా ఇలాంటి సమయంలో విరమణ ఏంటి అని ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ప్రపంచంలో పాకిస్తాన్ పటం లేకుండా చేయాలని చెప్పి, ప్రతి ఒక్కరి నుంచి సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదులు దాడులలో అమాయకులైన 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అప్పటినుంచి ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉండడంతో ఇరుదేశాల మధ్య యుద్ధం నెలకొంది. యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు మరియు క్షిపణులను భారత్ గాల్లోనే తునాతునకులగా చేసి పడేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలను కూల్చివేసింది.

అంతా బాగుంది… ఇక పాకిస్తాన్ పని అయిపోయిందని చాలామంది భారతీయులు అనుకున్నారు. కానీ అంతలోనే ఇరుదేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కూర్చోవడంపై భారతీయులకు చాలా మందికి నచ్చలేదు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. నిజంగా భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ అంతమవుతుంది. కానీ అలా ఎందుకు చేయలేకపోతున్నారని.. ప్రతి ఒక్కరూ మోడీని ప్రశ్నిస్తున్నారు. 1948లో కూడా పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు మన భారత సైన్యం విజయం దిశగా దూసుకెళ్తున్న సమయంలో భారతదేశంలో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. ఇక 1971లో యుద్ధంలో గెలిచిన కూడా పాకిస్తాన్ నుంచి భారత్ ఏమి పొందకుండానే సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకుందని గుర్తు చేశారు. మన భారతదేశానికి సైనికుల నైతిక ధైర్యం, తగినన్ని ఆయుధాలు, సమృద్ధిగా ఆర్థిక పరిస్థితి, అరేబియా మహాసముద్రంలో నౌకాదళ బలము ఇలా ఇవన్నీ ఉన్నా కూడా.. యుద్ధంలో విజయం సాధించే దశలో ఇలా కాల్పుల విరమణ ఏంటని ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్తాన్ అను ప్రయోగం చేసే ముప్పు ఉందని సమాచారం నాకు తెలిసిందని జెడి వాన్స్ చేసిన హెచ్చరికలతోనే భారతీయ నిర్ణయం తీసుకుంది అనుకున్నా కూడా పాకిస్తాన్ ఇలాంటి బెదిరింపులు చేయడం కొత్తెం కాదు. గతంలోనూ చాలాసార్లు ఇలా హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే చాలామంది కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి భారతి ఎందుకు ఒప్పుకుందని ప్రశ్నకు సరైన సమాధానం మాత్రము ఇప్పటికీ దొరకడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button