
ఇంగ్లాండ్లో ఎక్కడ చూసినా గిల్ హవానే సాగుతుంది…
రెండో టెస్టులో ఘనవిజయం సాధించిన భారత్..
గిల్ చేతిలో… షాంపైన్ బాటిల్
క్రైమ్ మిర్రర్ , స్పోర్ట్స్ న్యూస్ :- ఇంగ్లాండ్ వేదికగా జరిగిన అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత్ కెప్టెన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రెండవ టెస్టులో భారత్ విజయం సాధించడానికి గిల్ కీలక పాత్ర పోషించడం జరిగింది. మొదటి ఇన్నింగ్స్ లో 269 పరుగులు కొట్టిన గిల్ రెండవ ఇన్నింగ్స్ లో 161 పరుగులను చేసాడు. దీంతో మొత్తంగా రెండో టెస్టులో 430 పరుగులు చేసిన గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఇక్కడ ఇంగ్లాండ్ స్పాన్సర్లు విచిత్రంగా ప్రవర్తించారు.
మన భారతదేశంలో ఒక క్రికెట్ ప్లేయర్.. లేయర్ అఫ్ ది మ్యాచ్ గెలుచుకుంటే స్పాన్సర్లు వారికి పెద్ద మొత్తంలో డబ్బులను చెల్లిస్తూ ఉంటారు. కానీ ఇంగ్లాండ్లో మాత్రం కాస్త విచిత్రంగా ఉంటుంది. అత్యధిక పరుగులు చేసిన గిల్ చేతిలో షాంపైన్ మద్యం బాటిల్ పెట్టి ఇక్కడ మేము ఇలానే బహుమతి ఇస్తామని తెలిపారు. అయితే ఈ బాటిల్ ధర ఏకంగా 21000 ఉండడం గమనహార్కంగా ఉంది. ప్రస్తుతం గిల్ చేతిలో పట్టుకున్న ఆ బాటిల్ ఫోటోలు సోషల్ మీడియాలో తెర వైరల్ అవుతున్నాయి. ఇక మొదటి టెస్టులో ఇండియా ఓడిపోయిన కూడా రెండవ టెస్టులో ఘన విజయంతో మొదటి విజయాన్ని అందుకున్నారు. భారత్ తరపున బ్యాట్స్ మెన్స్ అలాగే బౌలర్లు అందరూ కూడా మెరుగ్గా రానిచ్చారు.
బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వైసీపీ
‘కన్నప్ప’ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నిర్మాత!