వైరల్సినిమా

భోజనానికి సరిపడా డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం : సమంత

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. సమంత నటించిన ప్రతి సినిమా కూడా ఆల్మోస్ట్ హిట్ అయినట్టే అని చెప్పవచ్చు. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో సమంత చక్రం తిప్పింది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అలాంటి సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన గతం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాను. మా కుటుంబంతోపాటు నేను పడిన కష్టాలు ఇప్పటికీ కూడా గుర్తు ఉంటాయని… వాటిని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చారు. ఒకానొక సమయంలో డబ్బులు సరిగా లేకపోవడంతో భోజనం తినడానికి కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. నటన మీద మక్కువతో సినిమా ఇండస్ట్రీ లోకి రావాల్సి వచ్చిందని… ఎన్నో కష్టాలు తర్వాత అవకాశం రావడంతో నటించిన మొట్టమొదటి సినిమానే ఎంతో పేరు, ప్రశంసలు తెచ్చిపెట్టాయని తెలిపారు. ఆ సమయంలో వాటిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు కానీ మెల్లిమెల్లిగా చాలా మంచి గుర్తింపు,ఆదాయం కూడా వచ్చింది అంటూ తన గతంలో జరిగిన కొన్ని విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఎంత కష్టపడితే అంత మంచి జీవితం ఉంటుందని తనను తాను మార్చుకొని జీవితంలో ముందుకు వెళ్లానని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో సమంత ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో రికార్డులు కూడా సృష్టించింది. ఆ తరువాత అక్కినేని హీరో నాగచైతన్యతో వివాహం చేసుకున్నారు. అంత సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల సమంత ఫ్యాన్స్ అందరూ షాకు కు గురయ్యారు. అంతేకాకుండా సమంత ఒక బలమైన వ్యాధితో పోరాడుతున్నట్లుగా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్న సమంత కొన్ని సినిమాల్లో నటిస్తూ ఉన్నారు.

Read also : కాంగ్రెస్ కు మొదటి ఎదురుదెబ్బ జూబ్లీహిల్స్ లోనే జరుగుతుంది : కేటీఆర్

Read also : రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు.. అజాగ్రత్తగా ఉంటే అంతే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button