ఆంధ్ర ప్రదేశ్

రైతులకు నష్టపరిహారం పెంచుతున్నాం : మంత్రి అచ్చన్న

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా తుఫాను వల్ల ఎంతోమంది రైతుల పంటలు నాశనమైపోయాయి. తుఫాన్ ఎఫెక్ట్ తో కురిసిన భారీ వర్షాలకు ఆర్థిక నష్టమే కాకుండా వ్యవసాయ రంగంలో కూడా భారీగా నష్టాలు ఎదురయ్యాయి. పంట నష్టపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు ప్రజలకు శుభవార్త తెలిపారు. తుఫాన్ వల్ల పంటలు కోల్పోయిన రైతులకు 17000 ఇస్తామని కొద్దిరోజుల క్రితం అధికారులు చెప్పగా ఇప్పుడు 25 వేలకు పెంచుతున్నట్లు మంత్రి అచ్చన్నాయుడు కీలక ప్రకటన చేశారు. మరోవైపు అరటి పంటలు ఎవరైతే వేశారో ఆ రైతులకు అదనంగా పదివేల రూపాయలను కల్పిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం పై ఈనెల 11 నాటికి 100% అంచనాలు సిద్ధమవుతాయి అని తెలిపారు. ఎక్కువగా దెబ్బతిన్నటువంటి కొబ్బరి చెట్లకు 1500 రూపాయలు చొప్పున పరిహారం ఇస్తామని సంచలన ప్రకటన చేశారు. రైతులు ఎవరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు అని.. సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ కూడా అందిస్తామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది అని.. మరీ ముఖ్యంగా రైతులకు ఎటువంటి నష్టం కలిగిన భరించే బాధ్యత మాది అని స్పష్టం చేశారు.

Read also : 3 రోజుల్లో.. ఓటీటీలో కి 4 బ్లాక్ బస్టర్ సినిమాలు!

Read also : ఒక్కో ఖండం నుంచి ఒక్కో జట్టు అయితే.. పాకిస్తాన్ కు కష్టమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button