ఆంధ్ర ప్రదేశ్

నేపాల్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొస్తున్నాం : నారా లోకేష్

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- నేపాల్ దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే నేపాల్ దేశ ప్రధాని కూడా తన పదవికి రాజీనామా చేసి ఎటో వెళ్లిపోయారు. ప్రస్తుతం నేపాల్ లో ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులను ఆపడానికి ఆర్మీ శత విధాలుగా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొంతమంది నేపాల్ దేశంలో చిక్కుకుపోయారు. మంత్రి నారా లోకేష్ నేపాల్ దేశంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. నేడు నేపాల్ నుంచి మన వాళ్లు సురక్షితంగా వస్తున్నారు అని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇప్పటికే హేటౌడా నుంచి బస్సులో బయలుదేరిన దాదాపు 22 మంది బీహార్ చేరుకున్నారని నారా లోకేష్ తెలిపారు.

Read also : పోలింగ్ స్టేషన్లు ,ఓటర్ల చివరి జాబితా ప్రచురణ

మరో 12 మంది చార్టర్ ఫ్లైట్ లో సెమీ కోర్టు నుంచి నేపాల్ గంజ్ కు, పోక్రా నుంచి కాట్మండుకు మరి కొంతమందిని తరలిస్తున్నట్లుగా మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. 133 మందితో కలిపి మొత్తం 200 మంది జనంతో విమానం భారతదేశానికి రానున్నట్లుగా నారా లోకేష్ మీడియా వేదికగా తెలిపారు. ఇప్పటికే నేపాల్ లో చిక్కుకున్నటువంటి ఏపీ వాసులు సురక్షితంగా బయలుదేరుతున్నామన్నట్లుగా వీడియోలు విడుదల చేశారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాసులను నేపాల్ నుంచి తమ రాష్ట్రానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి నారా లోకేష్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా మంత్రి నారా లోకేష్ కు ఈ బాధ్యతలను అప్పగించగా… అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి నేడు సురక్షితంగా నేపాల్ లో చిక్కుకున్న ప్రజలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో తీసుకువస్తున్నారు. వీళ్ళని క్షేమంగా తీసుకురావడానికి నారా లోకేష్ ఎంతోమంది అధికారులతో మాట్లాడి కృషి చేయడంతో నేపాల్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులు నారా లోకేష్ తో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Read also : అల్లాపూర్ SHO వెంకట్ రెడ్డిని ఘనంగా సన్మానించిన దేవరింటి మస్తాన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button