క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :-
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్దాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు ఆపడంలో తాను నేర్పరి అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి కోసం కృషి చేసేందుకు నేను ఎప్పుడూ కూడా ఎటువంటి బహుమతులు కోరలేదు అని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో చాలామంది నేను నోబెల్ బహుమతి కోసం బలంగా కోరుకున్నాను అంటూ రాసుకు వచ్చారు. కానీ నేనెప్పుడూ కూడా శాంతి కోసం కృషి చేసినందుకు గాను ఎప్పుడూ నోబెల్ బహుమతి కోరలేదు అని అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే నా ముఖ్య లక్షణం, లక్ష్యం కూడా అని అన్నారు. అంతేకానీ అవార్డుల కోసం నేనెప్పుడూ కూడా తహతహలాడలేదు అని స్పష్టం చేశారు. ఇప్పటివరకు కొన్ని మిలియన్ల ప్రాణాలు నేను కాపాడాను అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే గాజా యుద్ధం కూడా నా వల్లే ముగిసింది అని… ఇప్పటివరకు నేను 8 యుద్దాలను ఆపాను అని పేర్కొన్నారు. కేవలం నేను మాట్లాడి పరిష్కరించడం వల్లే ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలు ఆగిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య ఘర్షణలు నా దృష్టికి వచ్చాయి. వాటి పైన కూడా దృష్టి పెడతానని స్పష్టం చేశారు. మరోవైపు అత్యధికంగా టారిఫ్స్ విధించడం వల్ల కొన్ని యుద్ధాలు ఆపగలిగాను అని స్పష్టం చేశారు. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధం నేనే ఆపాను అంటూ మరోసారి చెప్పుకొచ్చారు. పాకిస్తాన్, ఇండియా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో 100, 150 మరియు 200% టారిఫ్స్ విధిస్తాను అని తీవ్రంగా హెచ్చరించాను. ఆ తరువాత వెంటనే 24 గంటల్లో యుద్ధం ముగించగలిగాను అని చెప్పుకొచ్చారు. నేను సుంకాలతో భయపెట్టకపోతే ఘర్షణలు ఆగేవి కాదని స్పష్టం చేశారు.
Read also : తడిసిన ప్రతి వరి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : ఎమ్మెల్యే కుంభం
Read also : బొడ్రాయి ఉత్సవానికి వడ్డేపల్లి దంపతుల రూ.16లక్షల విరాళం