క్రైమ్ మిర్రర్,అంతర్జాతీయ న్యూస్:-
పశ్చిమాసియాలో జరుగుతున్న భీకరమైన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా భారీ నష్టాలను ఎదుర్కొనేలా చేస్తుంది. నిన్న మొన్నటి వరకు ప్రపంచంలోని ప్రతి దేశం పలు విషయాలలో ఇబ్బందులు ఎదురవగా తాజాగా స్టాక్ మార్కెట్లు సైతం బిత్తర పోతున్నాయి. కేవలం ఒక నెలలోనే స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు వచ్చాయి. మార్చి నెల దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈ యుద్ధం ఓ పీడకలగా మిగిలిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో కేవలం ఈ ఒక్క నెలలోనే సెన్సెక్స్ 9340 పాయింట్లు (11.5%) నిఫ్టీ 2850 పాయింట్లు (11.3%) క్షీణించాయి. అంటే అక్షరాల 51 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద పూర్తిగా ఆవిరైపోయింది. గత రెండు రోజుల్లోనే 18.60 లక్షల కోట్ల నష్టం రావడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భాగంగా ఈ మార్కెట్ సంపద 46వేల కోట్లకు పైగానే తగ్గింది. దీంతో ఇన్వెస్టర్లు అందరూ కూడా లబోదిబోమంటూ.. వేరే సంపాదన మార్గాల వైపు దారులు వెతుకుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఎంతోమందికి ఒక క్లారిటీ అయితే రాగా.. యుద్ధం ముగిసిన అనంతరం మళ్లీ స్టాక్ మార్కెట్లు కలకలలాడుతాయని మరి కొంతమంది ఈ విషయాలపై కీలక చర్చలు చేస్తున్నారు. కాగా ఇరాన్ – అమెరికా, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా భారీగా నష్టాలు కూడా జరిగాయి.
శ్రీశైలం డ్యామ్ లో అట్టడుగుకు చేరిన నీటి నిల్వలు
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు వీర జవాన్ తల్లిదండ్రుల విజ్ఞప్తి!
