సినిమా

ఓటీటీ లో రికార్డు సృష్టించిన వార్ -2

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:-జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కలిసిన నటించినటువంటి సినిమా వార్ -2. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్లిన కూడా కలెక్షన్లు అంత పెద్దగా రాలేదు. ఇద్దరు బడా హీరోలు నటించిన కూడా అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకోలేకపోయింది. కానీ ఓటీటీ లో మాత్రం ఈ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం 3.5 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు పేర్కొంది. దీంతో గత వారంలో అత్యధిక వ్యూస్ వచ్చినటువంటి ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఆర్మాక్స్ లెక్కల ప్రకారం గత వారం మన భారతదేశంలో అత్యధిక మంది చూసిన సినిమాగా నిలవడంతో రికార్డు సృష్టించింది. థియేటర్ల వద్ద అంతగా ఆడకపోయినా ఓటీటీ లో మాత్రం ఈ సినిమా అద్భుతంగా దూసుకెళ్తుంది. ఎస్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మించినటువంటి ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లో విడుదలవుగా.. ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. థియేటర్ లో మంచి విజయాన్ని అందుకోలేక పోయినా ఓటీటీ లో మాత్రం రికార్డులు కొల్లగొడుతుంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కు సంతోషం లభించింది. సినిమా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడు ఈ వార్తను వింటున్న ఫ్యాన్స్ కాస్త సంతోషములో మునిగి తేలుతున్నారు.

Read also : ఆస్ట్రేలియా సిరీస్ తోనే RO-KO అంటే ఏంటో నిరూపించుకోవాలి : మాజీ కోచ్

Read also : మరికొద్ది సేపట్లో తెలంగాణలో భారీ వర్షాలు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button