
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- వైసీపీ నేత, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ 2024 ఎన్నికలలో ఓడిపోవడానికి గల కారణాలను తెలియజేశారు. కేవలం వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయామని మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైసిపి ప్రభుత్వం లో ప్రజలకు వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి మా బాధ్యతలను సక్రమంగా నిర్వహించామని వెల్లడించారు. అయినా కూడా ఎన్నికల్లో కేవలం వాలంటీర్ల వలన మాత్రమే ఓడిపోయామని వ్యాఖ్యానించారు.
నిన్న అనకాపల్లిలో… వైకాపా జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ” ఎన్నికల సమయంలో వాలంటీర్లు రాజీనామా చేస్తే… తిరిగే అధికారంలోకి వచ్చాక మళ్లీ తీసుకుంటామని చెప్పినా కూడా చాలామంది ఈ నిర్ణయం పాటించడానికి ముందుకు రాలేదని అన్నారు. వాలంటీర్లలో చాలామంది తమది గెజిటెడ్ ఉద్యోగం అన్నట్లుగా వాళ్ళ యొక్క తీరు వ్యవహరించారని అన్నారు. మేము ఎంతో ఆలోచనగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాలంటీర్లను తీసేస్తారని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాలంటీర్లు పట్టించుకోలేదని తెలిపారు. ఏది ఏమైనా కూడా… అంతా ఆలోచిస్తే వాలంటీరు వ్యవస్థ వల్లనే అధికారాన్ని మేము కోల్పోయామని గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటినుండి వైసీపీ కార్యకర్త ప్రతి ఒక్కరిని కూడా ముందుండి నడిపించేలా చూస్తామని… పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా పెద్దపీట వేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ వేదికగా హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లో డిజైనతాన్… డిజైనర్స్, క్రియేటర్స్ కోసం ప్రత్యేక ఈవెంట్