
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఇంగ్లాండ్ గడ్డపై మూడో టెస్ట్ మ్యాచ్ తెలుగు కుర్రాడు తన బౌలింగ్ తో అదరగొడుతున్నారు. మూడవ టెస్ట్ మ్యాచ్లు వేసిన మొదటి ఓవర్ లోనే రెండు కీలకమైన వికెట్లు పడగొట్టి ఆల్రౌండర్ ప్రతిభను కనబరుస్తున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లైనటువంటి డకెట్ మరియు క్రాలే వికెట్లను పడగొట్టి పెవిలియన్కు చేర్చాడు. దీంతో వేసిన మొదటి ఓవర్లలోనే టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అదే ఓవర్ లో పోప్ ఇచ్చిన క్యాచ్ ను కెప్టెన్ గిల్ నేలపాలు చేశాడు. లేదంటే మొదటి ఓవర్ లోనే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి మూడు వికెట్లు పడేవి. కదా ఇప్పటికే లండన్ వేదికగా రెండు టెస్ట్ మ్యాచ్లు జరగగా మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలువగా, రెండో మ్యాచ్లో భారత్ గెలిచింది. దీంతో ఇప్పుడు జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్లో ఇరు ప్లేయర్స్ కూడా హోరాహోరీగా తల పడుతున్నారు. ఓపినర్లు డకేట్ 23 పరుగులకు అవుట్ కాగా అదే ఓవర్లో క్రాలే 18 పరుగులకు అవుట్ అయి వెను తిరిగారు.
ఇక ఇండియన్ యువ ఆల్రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ ఆల్ రౌండింగ్ ప్రదర్శన కనుగొరుస్తున్నాడు. రెండవ టెస్ట్ మ్యాచ్లు అంతగా రాణించకపోయినా మూడో టెస్టులు మాత్రం తన బౌలింగ్ తో ఓపెనర్లను పెవిలియన్కు పంపించాడు. బోర్డర్ గబాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా గడ్డమీద సెంచరీ చేసి ఆల్ రౌండింగ్ ప్రదర్శన కనపరిచినట్లుగా ఇవాళ నితీష్ కుమార్ రెడ్డి ఆటతీరు కనబడుతుంది. ఇక దీంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ 50 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఇక ఈ మ్యాచ్లో స్టార్ బౌలర్ బుమ్రా కూడా తోడవడంతో ఇండియాకు కొంచెం బలం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా ఈ టెస్ట్ మ్యాచ్లో గెలవాలనే తపనతో ఇండియా వ్యూహాలను రచిస్తోంది.
గాల్లోనే ‘ఢీ’ కొన్న రెండు విమానాలు.. ఒక భారత యువకుడు మృతి!..