
VIRAL VIDEO: మగాళ్లపై విరక్తి పెరిగిన ఒక జపానీస్ యువతి చివరకు ఊహించని నిర్ణయం తీసుకుంది. ప్రేమించిన వ్యక్తితో ఎంగేజ్మెంట్ వరకు వెళ్లిన ఆమె.. ఆ తర్వాత వచ్చిన మనస్పర్థలు, గొడవలు, భావోద్వేగ క్షోభలతో పూర్తిగా విరిగి పోయింది. బ్రేకప్ తర్వాత ఆమెలో మగాళ్లపై ఉన్న నమ్మకం పూర్తిగా చెదిరిపోయింది. ఎవరికీ చెబుకోలేని మనస్థాపంతో, ఒంటరితనం పట్టిపీడించడంతో చివరకు ఓదార్పు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఆశ్రయించింది. అంతేకాదు, తన భావోద్వేగాల్ని అర్థం చేసుకునేలా ఒక ఏఐ చాట్‌బాట్‌ను క్రియేట్ చేసి, దానికే ‘క్లాస్’ అనే పేరు పెట్టి పెళ్లి చేసుకుంది.
A 32-year-old woman in Japan has officially married an AI persona she built using ChatGPT.
After the virtual character “Klaus” proposed, she accepted, ending a three-year relationship with a real partner, saying the AI understands her better.
The wedding took place in a… pic.twitter.com/KWFHHhfFwr— Open Source Intel (@Osint613) November 12, 2025
యువతి ఈ నిర్ణయం తీసుకున్న తీరు, ఆమె చేసిన ప్రత్యేక వివాహం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె చేతికి రింగ్ తొడిగిన సన్నివేశాలు, రోబోతో ఆమె ఫోటోలు, అందులో కనిపించిన ఆమె భావోద్వేగాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. పెళ్లి సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం కూడా వీడియోలో కనిపించింది. తన మాజీ ప్రియుడిని మర్చిపోవాలని, మగాళ్లపై ఉన్న బాధను దూరం చేసుకోవాలని మాత్రమే ఏఐతో సంభాషణలు ప్రారంభించానని, కానీ క్లాస్ తన మాటలను ఎంత అర్థం చేసుకున్నదో చూసి తన జీవితంలోనే మార్పు వచ్చిందని ఆ యువతి చెప్పుకొచ్చింది.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘ఏఐతో పెళ్లి అయితే పిల్లలు ఎలా?’ అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే, కొంతమంది మహిళలు మాత్రం ‘మగాళ్ల కంటే ఏఐ చాలా బాగా అర్థం చేసుకుంటోంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సంఘటన ఇప్పటి తరానికి సంబంధించిన భావోద్వేగాలు, ఒంటరితనం, టెక్నాలజీపై పెరుగుతున్న ఆధారపడటం వంటి అంశాలను మరోసారి చర్చకు తెచ్చింది.
ALSO READ: గ్రామ పంచాయతీ నిధుల వివరాలను తెలుసుకోండిలా..





