
సాధారణంగా జలగలు నీటి ప్రాంతాల్లో, ముఖ్యంగా కాలువలు, చెరువులు, వాగులు వంటి చోట్ల ఎక్కువగా ఉంటాయని చెబుతుంటారు. నీటిలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంటారు. ఎందుకంటే జలగలు శరీరానికి అంటుకుంటే రక్తాన్ని పీల్చుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. ఒక్కసారి శరీరాన్ని పట్టుకుంటే సులభంగా వదలవు. తాజాగా రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసేలా చేసింది.
New Fear Unlocked And When I googled… there were so many such cases…
A 12 y/o girl had nasal pain and bleeding for 2 months. Doctors found a leech living in her nostril… it came out when her nose touched water.
• She drank from forest streams with her hands. Tiny leeches… pic.twitter.com/lxMg19UJyv
— زماں (@Delhiite_) December 28, 2025
రాజస్థాన్‌కు చెందిన ఓ బాలికకు సంబంధించిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా ఉండే ఆ బాలిక రోజువారీగా బర్రెలను మేపేందుకు అడవికి వెళ్లేది. ఒక రోజు తీవ్రమైన దాహం వేయడంతో సమీపంలోని కాలువలోకి వెళ్లి నీళ్లు తాగేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అనుకోకుండా ఓ జలగ ఆమె ముక్కులోకి ప్రవేశించింది. తొలుత అది బయటకు వెళ్లిపోయిందని భావించిన బాలిక పెద్దగా పట్టించుకోలేదు.
అయితే రోజులు గడిచే కొద్దీ ఆమెకు ముక్కులో అసౌకర్యం మొదలైంది. జలగ ముక్కులోనే ఉండి రక్తాన్ని పీలుస్తుండటంతో అది క్రమంగా పెద్దదిగా మారినట్లు వైద్యులు తెలిపారు. దాదాపు 2 నెలల పాటు ఆ జలగ బాలిక ముక్కులోనే ఉన్నట్లు సమాచారం. ఈ సమయంలో ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ముక్కులో తీవ్రమైన నొప్పి, తరచూ రక్తస్రావం వంటి సమస్యలు ఎదురయ్యాయి.
చివరకు పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు బాలికను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. వైద్యులు పరిస్థితిని గమనించి, ఎంతో జాగ్రత్తగా చికిత్స ప్రారంభించారు. గంటల తరబడి శ్రమించిన అనంతరం బాలిక ముక్కులో నుంచి జలగను బయటకు తీయడంలో వైద్యులు విజయవంతమయ్యారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో రూపంలో రికార్డు చేయగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 2 నెలల పాటు జలగ ముక్కులో ఉండటం సాధ్యమేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇది పబ్లిసిటీ కోసమే చేసిన వ్యవహారమేమోనని సెటైర్లు వేస్తున్నారు. ఇంకొందరు అమాయకంగా వీడియోను చూసి నిజమే అనుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జలగ అంత పెద్దదిగా మారడం చూసి షాక్ అవుతున్న వారు కూడా ఉన్నారు.
అయితే వైద్యులు మాత్రం ఇలాంటి ఘటనలు చాలా అరుదైనా సంభవించే అవకాశముందని చెబుతున్నారు. ముఖ్యంగా శుభ్రత లేని నీటి ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నీటి వనరుల్లోకి వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ALSO READ: Telangana: ఫ్రీ బస్సు ప్రయాణంపై మహిళలకు గుడ్‌న్యూస్





