Homeఆంధ్ర ప్రదేశ్వేడెక్కిన బెజ‌వాడ రాజ‌కీయం...! వైసీపి విజ‌య‌వాడ‌ అభ్య‌ర్థిగా దేవినేని అవినాస్‌...!

వేడెక్కిన బెజ‌వాడ రాజ‌కీయం…! వైసీపి విజ‌య‌వాడ‌ అభ్య‌ర్థిగా దేవినేని అవినాస్‌…!

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మున్సిపల్ ఎన్నికలతో బెజవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర రాజకీయాలకు ప్రధాన భూమిక పోషిస్తుంది విజయవాడ. అటువంటి విజయవాడ మేయర్ అంటే దాదాపు మంత్రి పదవితో సమానం. అందుకే కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును ఖరారు చేసింది. పొత్తులో భాగంగా విజయవాడ మేయర్ పదవిని జనసేనకు కేటాయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే తెలుగుదేశం పార్టీలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. విజయవాడ కార్పొరేషన్ ను ఏకపక్షంగా గెలుచుకునేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు వ్యూహాత్మకంగా వంగవీటి రాధాకృష్ణను ఎంపిక చేశారు.

ఆత్మరక్షణలో వైసిపి…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలో ఆత్మ రక్షణలో పడింది. కనీసం ఉనికి చాటుకునే ప్రయత్నం చేయనుంది. ఎందుకంటే విజయవాడలో వైసీపీకి బలం అంతంత మాత్రమే. వంగవీటి రాధాకృష్ణను ఢీ కొట్టాలంటే బలమైన అభ్యర్థి అవసరం. ఈ నేపథ్యంలో వైసీపీ తరఫున మేయర్ అభ్యర్థిగా దేవినేని అవినాష్ ను బరిలోకి దించేందుకు జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరోసారి దేవినేని అవినాష్ ను బలి పశువును చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవినేని అవినాష్ ఎమ్మెల్యే కావాలన్నది లక్ష్యం. అయితే ఈసారి విజయవాడ ఎంపీగా పోటీ చేయిస్తారని ప్రచారం నడిచింది. ఇప్పుడు మేయర్ అభ్యర్థిగా పోటీలో పెడతారని కొత్త ప్రచారం ప్రారంభం అయింది.

ఒక్కసారి కూడా గెలవలే…

దేవినేని అవినాష్ రాజకీయ ట్రాక్ రికార్డును గమనిస్తే ఒక్కసారి కూడా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. 2014లో సమైక్యాంధ్ర పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా.. 2019లో గుడివాడ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా.. 2024లో విజయవాడ ఈస్ట్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఒకప్పుడు ఆయన తండ్రి దేవినేని నెహ్రూ జిల్లా రాజకీయాలను శాసించారు. మంచి బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అటువంటి దేవినేని నెహ్రూ రాజకీయ వారసత్వాన్ని.. ఆయన సంపాదించిన బ్రాండ్ ఇమేజ్ను పూర్తిగా అటకెక్కించిన అపవాదు అవినాష్ పై పడింది. చివరకు జగన్ కోసం విజయవాడలో ఓ 100 మంది కార్యకర్తలను పోగేసి స్థాయికి దిగజారి పోయారు అనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకు జగన్ విసిరిన రాజకీయ వ్యూహాల్లో చిక్కుకున్నారు అవినాష్. గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లి ఆదేశాలతో టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసు, పట్టాభి ఇంటి పై దాడి ఘటనలు సహా పలు వివాదాల్లో చిక్కుకున్నారు. క్రిమినల్ కేసులను ఎదుర్కొని జైలు భయం పట్టుకుంది. కనీసం తూర్పు నియోజకవర్గంలో ఉనికి చాటుకునే ప్రయత్నం చేసిన ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు మేయర్ అభ్యర్థిగా నిలబడి భారీ ఓట్ల తేడాతో ఓడిపోతే అవినాష్ పొలిటికల్ కెరీర్ ముగింపు దశకు రావడం ఖాయం.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  “పెళ్లి వద్దు కానీ పిల్లలు కావాలి”- సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
  2.  దేశం విడిచివెళ్లాలన్న నోటీసుపై హైకోర్టును ఆశ్రయించనున్న ఇమ్రాన్ ఖాన్‌!
  3. మదనపల్లిలో “లేడీ డాన్” కోనేటి సులోచన అరెస్ట్.. ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు!
  4. ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ.. రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన వైనం

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు