
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కరూర్ లో నిర్వహించినటువంటి సభలో తొక్కిసలాట జరిగిన విషయం, ఈ సభలో దాదాపు 41 మందికి పైగా మరణించడం అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ కరూర్ లో జరిగిన ఈ ఘటన గురించి తాజాగా హీరో అజిత్ స్పందించారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఎంతో బాధనిపించింది అని.. అయితే ఈ ఘటనకు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఒక్కడే బాధ్యుడు కాదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో నేను, నాతో పాటు మీడియా సహా ప్రతి ఒక్కరిది తప్పు ఉంది అని తెలిపారు. పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించుకోవడం, ఎక్కువమంది జనం వస్తేనే సభలు సక్సెస్ అయినట్లు చూపించాలి అని అనుకోవడం ఇకనుంచి ఆపేయాలని పార్టీ నేతలకు అజిత్ సూచించారు. ప్రస్తుత కాలంలో క్రికెట్ మ్యాచ్లకు ఎంతోమంది జనం వెళ్తున్నారు. కానీ అక్కడ ఎటువంటి తొక్కిసలాటలు అనేవి జరగట్లేదు. మరి అలాంటప్పుడు అక్కడ జరగని తొక్కిసలాటలు ఇలా సినిమా స్టార్ల చుట్టూ ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని.. ప్రజలు కూడా మారాలి అని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అజిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సభ కైనా సరే పరిమితికి మించి జనాలు వస్తే పోలీసులు మాత్రం ఏం చేస్తారు అని.. ఇందులో ప్రతి ఒక్కరిది తప్పేనని హీరో అజిత్ పేర్కొన్నారు. అయితే అజిత్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలను కొంతమంది సమర్థిస్తుండగా మరి కొంతమంది ఖండిస్తున్నారు. మరి అజిత్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : ఐపీఎల్ లో హెడ్ కోచ్ గా అడుగు పెట్టబోతున్న యువరాజ్ సింగ్?.. ఇక దబిడి దిబిడే!
Read also : ఈ రెండు రోజులు సేఫ్.. మరో వాయుగుండంతో భారీ వర్షాలు





