
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :-
టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కరూర్ లో నిర్వహించినటువంటి సభలో తొక్కిసలాట జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ తొక్కిస్తాలాట లో భాగంగా 41 మంది అక్కడికక్కడే మృతి చెందడం కూడా యావత్ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనపై అప్పుడే విజయ్ చనిపోయిన వారికి 20 లక్షల రూపాయలు చొప్పున కుటుంబాలకు సహాయార్థంగా ఇచ్చారు. అయితే ఈ సందర్భంలోనే ఆ తొక్కిసలాటలో చనిపోయిన ఒకరైన రమేష్ భార్య సంఘవి సహాయార్థంగా ఇచ్చినటువంటి 20 లక్షల రూపాయల చెక్కును వెనక్కి పంపించింది. మాకు డబ్బు ముఖ్యం కాదు అంటూ.. విజయ్ సారే నేరుగా వచ్చి పరామర్శిస్తారు అని అనుకున్నాం కానీ ముందే డబ్బును తీసుకోమని చెప్పడం మాకు నచ్చలేదని చెప్పుకొచ్చారు. ఆయన పరామర్శ కోసం చాలానే ఎదురు చూశాం.. కానీ ఆయన నేరుగా వచ్చి పరామర్శించడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 27వ తేదీన చనిపోయిన 41 మంది కుటుంబాలను విజయ్ ఒక రిసార్ట్ కి పిలిపించి మరి పరామర్శించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ రమేష్ భార్య సాంగ్వి అనే మహిళ చెన్నై సమావేశానికి వెళ్లేందుకు నిరాకరించారు. అయినప్పటికీ కూడా మమ్మల్ని కాదని మా బంధువులను ఆ సమావేశానికి తీసుకువెళ్లారని ఆ మహిళా బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా సరే మాకు డబ్బులు ముఖ్యం కాదు… మీరు మా వద్దకు వచ్చి పరామర్శించడమే కావాలి అని విజయ్ కు వెల్లడించారు. దీంతో విజయ్ మరి నేరుగా బాధితురాలు ఇంటికి వెళ్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.
Read also : పెబ్బేరు నుంచి ఇరుముడితో శబరిమలకు మహాపాదయాత్ర..!
Read also : ఈతవనం ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై





