HomeతెలంగాణVijay- Rashmika: విజయ్ – రష్మిక మ్యారేజ్ డేట్ ఫిక్స్, వెడ్డింగ్ స్పాట్ ఎక్కడంటే?

Vijay- Rashmika: విజయ్ – రష్మిక మ్యారేజ్ డేట్ ఫిక్స్, వెడ్డింగ్ స్పాట్ ఎక్కడంటే?

Vijay- Rashmika: తెలుగు సినిమా పరిశ్రమలో మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు తాము ప్రేమించినవారికి వివాహాం చేసుకొని ఇంటివారు అయ్యారు. వచ్చే ఏడాది ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న జంట ఒక్కటి కానున్నారు. వారే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా. ఎప్పటి నుంచో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఈ జంట మాత్రం ఎప్పుడు ఈ విషయాన్నీ బయటపెట్టలేదు.

అక్టోబర్ లో సింపుల్ గా నిశ్చితార్థం

ఇక ఈ అక్టోబర్ లో విజయ్ – రష్మిక చాలా సింపుల్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. విజయ్ ఇంట్లోనే కేవలం అతికొద్దిమంది బంధుమిత్రుల మధ్య వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఎంగేజ్ మెంట్ తరువాత కూడా విజయ్, రష్మిక దాని గురించి బయటపెట్టలేదు. అయితే వీరిద్దరూ తమ పర్సనల్ విషయాలను మీడియాకు దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఏ విషయాన్నీ అధికారికంగా చెప్పడం లేదని సమాచారం.

ఫిబ్రవరి 29న డెస్టినేషన్ వెడ్డింగ్

తాజాగా విజయ్- రష్మిక పెళ్లి డేట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక డేట్ వైరల్ గా మారింది. ఫిబ్రవరి 26 న వీరిద్దరి పెళ్లి ఉదయపూర్ లో ఘనంగా జరగనుందని తెలుస్తోంది. ఈ మధ్యనే ఈ పెళ్లి డేట్ ను ఇరు కుటుంబ సభ్యులు కలిసి ఫైనల్ చేశారని, డెస్టినేషన్ వెడ్డింగ్ గా వీరిద్దరి పెళ్లి ఉదయపూర్ లో గ్రాండ్ గా జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడకు కూడా ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువమంది మాత్రమే పిలవనున్నారని, హైదరాబాద్ వచ్చాకా గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారని.. ఈ వేడుకకు ఇండస్ట్రీ మొత్తం హాజరుకానుందని సమాచారం. ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది త్వరలోనే తెలియనుంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments