
మునుగోడు, క్రైమ్ మిర్రర్ ::- కేసీఆర్ ను సిట్ విచారణ పేరుతో ఉద్దేశ్య పూర్వకంగా వేధిస్తున్నారని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు మందుల సత్యం మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఫోన్ ట్యాపింగ్ పై వేసిన సిట్ ను వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరుతూ మునుగోడు మండల కేంద్రములో మండల అధ్యక్షుడు మందుల సత్యం ఆధ్వర్యములో బారి ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.మండల అధ్యక్షుడు మందుల సత్యం మాట్లాడుతూ… ఇది కేవలం కక్ష్య సాధింపు చర్యలు తప్ప మరేవీ లేదన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని అతనిపై ఎన్ని సిట్ లు వేసిన చేసేది ఏమీలేదని బెదిరేది లేదన్నారు. మొదటగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కేసీఆర్ పై వేసిన సిట్ ను వెంటనే వెనక్కు తీసుకోవాలని,లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు..జిల్లా , నియోజకవర్గ,మండల నాయకులు పాల్గొన్నారు.
(VIDEO): అంతా చూస్తుండగా పెళ్లిలో ముద్దు పెట్టుకోబోయిన వధూవరులు.. కానీ
ఇంతకన్నా దారుణం ఇంకేమీ ఉండదేమో.. బాలికపై తండ్రి, మేనమామ అత్యాచారం





