Homeక్రీడలుVaibhav Suryavanshi: ఐపీఎల్‌ను ఊపేసిన 15 ఏళ్ల కుర్రాడు.. వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత!

Vaibhav Suryavanshi: ఐపీఎల్‌ను ఊపేసిన 15 ఏళ్ల కుర్రాడు.. వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత!

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ట్రోఫీని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు గెలుచుకున్నప్పటికీ, అభిమానుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన ఆటగాడు మాత్రం 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ. రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడిన ఈ యువ బ్యాటర్‌ తన దూకుడు ఆటతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

16 ఇన్నింగ్స్‌ ల్లో 776 పరుగులు

ఈ సీజన్‌ లో వైభవ్‌ మొత్తం 16 ఇన్నింగ్స్‌ ల్లో 776 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. దీంతో ప్రతిష్టాత్మక ఆరెంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు సాయి సుదర్శన్‌ పేరిట ఉండగా, ఇప్పుడు అది వైభవ్‌ ఖాతాలో చేరింది. గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ 732 పరుగులతో రెండో స్థానంలో, సాయి సుదర్శన్‌ 722 పరుగులతో మూడో స్థానంలో నిలిచారు.

సిక్సర్ల విషయంలోనూ వైభవ్‌ కొత్త రికార్డులు

పరుగుల పరంగా మాత్రమే కాకుండా సిక్సర్ల విషయంలోనూ వైభవ్‌ కొత్త రికార్డులు నెలకొల్పాడు. ఈ సీజన్‌లో అతడు 72 సిక్సర్లు బాదాడు. దీంతో ఒకే ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు క్రిస్‌ గేల్‌ పేరిట ఉండేది. అలాగే 63 ఫోర్లు కూడా బాదాడు. అతడి స్ట్రైక్‌రేట్‌ 237.30గా నమోదవడం విశేషం.

వేగంగా 1000 ఐపీఎల్‌ పరుగులు పూర్తి  

వైభవ్‌ బ్యాటింగ్‌ ఎంత దూకుడుగా సాగిందో అతడి వ్యక్తిగత స్కోర్లు కూడా చెబుతున్నాయి. మూడు సందర్భాల్లో శతకానికి చేరువగా వెళ్లి 93, 97, 96 పరుగుల వద్ద అవుట్‌ అయ్యాడు. లేకపోతే ఈ సీజన్‌లో మరిన్ని సెంచరీలు అతడి ఖాతాలో చేరేవి. ఇంకా వేగంగా 1000 ఐపీఎల్‌ పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ వైభవ్‌ రికార్డు సృష్టించాడు. కేవలం 440 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. అలాగే పవర్‌ప్లే ఓవర్లలో అత్యధికంగా 521 పరుగులు చేసి మరో ఘనత సాధించాడు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు