మార్చి 15 సాయంత్రం 5 గంటల ప్రీ-రిలీజ్ ఈవెంట్..
మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల…!
మార్చి 19న తెల్లవారుజామున 4 AM లేదా 5 AM నుండి బెనిఫిట్ షోలు..
క్రైమ్ మిర్రర్, సినిమా బ్యూరో: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం” విడుదలకు సిద్ధమైంది. హరీష్ శంకర్ దర్శకత్వం తెరకెక్కనున్న పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.
చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” అధికారిక ట్రైలర్‌ను ఈ రోజు అనగా మార్చి 14, శనివారం సాయంత్రం 6:30 గంటలకు విడదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది చిత్ర బృందం.. కాగా మార్చి 15 (ఆదివారం) సాయంత్రం 5 గంటల నుండి హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో అత్యంత భారీగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.
మార్చి 19న తెల్లవారుజామున 4 AM లేదా 5 AM నుండి బెనిఫిట్ షోలు ప్రదర్శించేందుకు అనుమతి లభించింది. ఈ షో టికెట్ ధర రూ. 500గా నిర్ణయించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ (DSP) పాటలు అందించగా, తమన్ (S. Thaman) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
