
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- అన్నదాత… ఆరుగాలం కష్టపడి పంట పండిస్తాడు. కాపుకొచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. సమయానికి నీళ్లు, ఎరువులు అందిస్తారు. అయితే.. అనుకోని విపత్తులు రైతన్నను నిండా ముంచుతుంటాయి. కరువు, వరదలు… పంటలను నాశనం చేస్తుంటాయి. ప్రకృతి విలయాలను ఆపడం ఎవరి చేతుల్లోనూ ఉండవు కనుక.. ఏమీ చేయలేం. కానీ.. ఇప్పుడు చేజేతులా రైతులకు కష్టాలు తెచ్చిపెడుతున్నారు. యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. సకాలంలో యూరియా అందక.. పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో… రైతన్నలు లబోదిబోమంటున్నారు. కొందరైతే.. చేసేది లేక… పంటను దున్నేస్తున్నారు. ఇదెక్కడి పరిస్థితి మహాప్రభో అంటూ కన్నీరు పెడుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రైతన్న పరిస్థితి ఇలాగే ఉంది. ఏపీతో పోలిస్తే… తెలంగాణలో యూరియా కొరత మరీ ఎక్కువగా ఉంది.
Read also : తుంగతుర్తి కాంగ్రెస్‌లో మళ్లీ వర్గ విభేదాల రగడ
రంగారెడ్డి జిల్లా పోచారం గ్రామంలో సర్పంచ్‌గా పనిచేసిన శ్రీను.. నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. యూరియా అందక… పంట ఎదగలేదు. కంకి పట్టలేదు. ఇప్పట్లో యూరియా అందుతుందన్న ఆశ కూడా పోయింది అతనికి. దీంతో… నాలుగు ఎరకాల్లోని మొక్కజొన్న పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు. కష్టపడి వేసుకున్న పంటను తన చేతులతోనే ధ్వంసం చేసుకున్నాడు. ఓవైపు యూరియా కొరత వేధిస్తుంటే.. ఉన్న యూరియాను కూడా సక్రమంగా అమ్మడం లేదంటున్నారు శ్రీను. యూరియా కోసం దరఖాస్తు చేసుకుంటే.. తన పేరుపై మరో వ్యక్తికి యూరియా ఇచ్చేశాడని ఆరోపిస్తున్నారు. దీంతో… ఇక యూరియా తనకు అందదని అర్థమైన పంటను దున్నేయక తప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క శ్రీను పరిస్థితి మాత్రమే కాదు. తెలంగాణలో యూరియా కొరత వల్ల… ఎంతో మంది రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
Read also : వరదల బీభత్సం.. వణికిపోతున్న ప్రజలు!
తెలంగాణలో ఎక్కడ పీఎసీఎస్ కేంద్రాలు కనిపించినా… కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఉంటున్నాయి. రోజుల తరబడి క్యూలైన్లలో నిల్చోలేక… క్యూలైన్లలో చెప్పులు పెడుతున్నారు. కొన్ని చోట్ల దుప్పట్టు తీసుకెళ్లి అక్కడే నిద్రిస్తున్నారు. ఇంత కష్టపడ్డా ఎరువులు దొరకడంలేదు. నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఎవరు..? తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ధూషిస్తోంది. కేంద్రం… రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారే తప్ప… రైతుల సమస్యలకు పరిష్కారం దొరకడంలేదు. ఈ పరిస్థితి మారేదెప్పుడు..? అన్నదాతలకు యూరియా కష్టాలు తీరేదెప్పుడు..?
యూరియా లేక మొక్కజొన్న పంట ఎదగలేదు. రెండు నెలలు గడిచినా కంకి పెట్టలేదు. దీంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన రైతు.. నాలుగు ఎకరాల మొక్కజొన్న పంటను ట్రాక్టర్ తో దున్ని ధ్వంసం చేశాడు. పోచారం గ్రామానికి చెందిన శ్రీను.. గత పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్ గెలిచాడు. నాలుగు ఎకరాల భూమిలో మొక్కజొన్న విత్తనాలు నాటాడు. సమయానికి యూరియా అందలేదు. దరఖాస్తు చేసుకుని యూరియా కేంద్రాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. తన పేరుతో వేరే వ్యక్తి యూరియా తీసుకెళ్లిపోయాడని అధికారులు చెప్పడంతో… ఆవేదనకు గురయ్యారు. చేసేదేమీ లేక శ్రీను తన పంటను తానే ధ్వంసం చేసుకున్నాడు.
Read also : ఉత్తరాదిలో వరద బీభత్సం, 30 మంది మృతి