
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మెంథా తుఫాన్ తెలంగాణ రాష్ట్రంపై కూడా తీవ్ర ప్రభావం చూపనుందని తాజాగా IMD అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటినుంచే వర్షాలు పడుతుండగా తెలంగాణ రాష్ట్రంకు రేపటి నుంచి ఈ తుఫాన్ ప్రభావం చూపుతుంది అని స్పష్టం చేశారు. ఈ తుఫాన్ కారణంగా దాదాపు కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు దంచుకొడతాయని తెలిపారు.
తెలంగాణలో తుఫాన్ ప్రభావ జిల్లాలు
1. భూపాలపల్లి
2. ములుగు
3. భద్రాద్రి
4. మహబూబాబాద్
మొంథా తుఫాన్ కారణంగా ఈ నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ మరియు హనుమకొండ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది. కాబట్టి నేటి రాత్రి నుంచి మరో రెండు రోజులు పాటు తెలంగాణ ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప దూరపు ప్రయాణాలు చేసుకోవద్దు అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 22 జిల్లాలలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. మరి తెలంగాణలోనూ సెలవు ప్రకటిస్తారా లేదా అనేది మరి కొంచెం సేపట్లో అధికారులు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏపీతో పోలిస్తే తెలంగాణకు తుఫాన్ ప్రభావం తక్కువ అయినప్పటికీ కూడా భారీ వర్షాలు దంచుకోడతాయని సూచించారు.
Read also : ఏంటి ఈ పరిస్థితి… ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు చేరట్లేదు?
Read also : తుఫానుకు అంతా సిద్ధం… నేటి నుంచే అతి భారీ వర్షాలు!





